Share News

Hyderabad: ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మృతి..

ABN , Publish Date - Mar 12 , 2025 | 10:16 AM

ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మృతి చెందిన విషాద సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. మరొకరు కుటుంబ కలహాల నేపధ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Hyderabad: ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మృతి..

- రోడ్డు ప్రమాదంలో ఒకరు.. ఉరేసుకుని మరొకరు..

హైదరాబాద్: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు(Software engineers) మృతి చెందారు. కడప ప్రాంతానికి చెందిన జహర్‌భాను, అమర్‌భాష చిన్న కుమారుడు రోషన్‌ (27) మూడేళ్లుగా చందానగర్‌లో ఉంటూ హైటెక్‌సిటీ(Hi-tech City)లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. బయటకు వెళ్తున్నానని రూమ్మెట్‌కు చెప్పి సోమవారం అర్ధరాత్రి బుల్లెట్‌ వాహనంపై బయటకు వెళ్లాడు. దీప్తిశ్రీనగర్‌ కమాన్‌ మలుపు వద్ద ముందువెళ్తున్న టిప్పర్‌ను ఓవర్‌ టేక్‌ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ వార్తను కూడా చదవండి: Water board: నగరంలో.. ఒక క్యాన్‌.. ఒక మొబైల్‌ నంబర్‌ విధానం


బిడ్డకు అన్నం పెట్టే విషయంలో గొడవ

తమ బిడ్డకు అన్నం తినిపించే విషయంలో భార్యభర్తల మధ్య జరిగిన గొడవతో మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉరేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. ఏపీ నంద్యాలకు చెందిన సంగిరెడ్డి నర్సింహారెడ్డి(28), విష్ణుప్రియ దంపతులకు 6 నెలల కుమారుడు ఉన్నాడు. వీరు మియాపూర్‌ ఆదిత్యనగర్‌లో ఉంటున్నారు. నర్సింహారెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మంగళవారం మధ్యాహ్నం బాబుకు అన్నం తినిపించే విషయంలో దంపతుల మధ్య గొడవ మొదలైంది. మనస్తాపానికి గురైన నర్సింహారెడ్డి గదిలోకి వెళ్లి డోర్‌ లాక్‌ చేసుకున్నాడు. ఎంత సేపటికీ రాకపోవడంతో భార్య చుట్టుపక్కల వారి సాయంతో తలుపు పగలుగొట్టి చూడగా ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. కిందికి దించేసరికి చనిపోయి ఉన్నాడు.


మరో ఘటనలో ప్రైవేట్‌ ఉద్యోగి..

అనారోగ్యం కారణంగా ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పూడూరుకు చెందిన రోహిత్‌కుమార్‌ ఓల్డ్‌ హఫీజ్‌పేటలో స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అనారోగ్య కారణాలతో ఉద్యోగానికి వెళ్లకుండా గదిలోనే ఉంటున్నాడు. మంగళవారం ఉదయం స్నేహితులకు ఫోన్‌ చేసి ట్యాబ్‌లెట్స్‌ వేసుకుని పడుకున్నానని చెప్పాడు. వారు విధులు ముగించుకుని ఇంటికి వచ్చిచూడగా తలుపు తీయడం లేదు. బలవంతంగా తలుపులు తీసి చూడగా అప్పటికే ఉరేసుకుని మృతిచెందాడు.

city6.2.jpg


ఈ వార్తలు కూడా చదవండి:

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

అమెరికాలోనే పేపాల్‌ డాటా లీకేజీ!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2025 | 10:16 AM