Share News

Hyderabad: వ్యాపారం పేరిట భారీ మోసం.. రూ.18 కోట్ల మేరకు..

ABN , Publish Date - Mar 12 , 2025 | 07:43 AM

వ్యాపారం చేస్తున్నామంటూ నమ్మించి బస్తీలోగల పలువురి వద్ద నుంచి అప్పులు తీసుకుని మోసానికి పాల్పడ్డ ఉదంతం ఒకటి నగరంలో వెలుగుచూసింది. తాము మోసపోయామని గుర్తించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

Hyderabad: వ్యాపారం పేరిట భారీ మోసం.. రూ.18 కోట్ల మేరకు..

- సీసీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు

హైదరాబాద్‌ సిటీ: వ్యాపారం పేరుతో పలువురు నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులను సేకరించి రూ.18కోట్ల మేర మోసం చేసిన సంస్థ నిర్వాహకులపై సీసీఎస్‏లో కేసు నమోదైంది. అమీర్‌పేట(Ameerpet) ధరంకరం రోడ్డు పారామౌంట్‌ అపార్టుమెంట్‌లోని రెండో అంతస్తులో ప్రకృతి ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి సీఈఓగా సులూరు రాంప్రసాద్‌, డైరెక్టర్లుగా షేక్‌ జాఫర్‌ సాదిక్‌, మనుబోలు సురేష్‌, రాజాపురం శ్రీనాధ్‌ రెడ్డిలు కొనసాగుతున్నారు. ఈ వ్యాపార సంస్థలో డీలర్‌షిప్‌(Dealership) ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా ప్రచారం చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూ స్నాతకోత్సవం వాయిదా..


city2.2.jpg

2023 ఏప్రిల్‌ 4న సినీనటులు అలీ, హిమజ కార్యాలయాన్ని ప్రారంభించారు. సంస్థ పేరిట పలు రకాల ఉత్పత్తులను తయారుచేసి, వాటిని విక్రయించేందుకు డీలర్‌షిప్‏లు ఇస్తామని చెప్పి సుమారు 250 మంది నుంచి (ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల పైబడి వసూలు చేసి) సుమారు రూ.18కోట్ల వరకు సేకరించారని బాధితులు తెలిపారు. వ్యాపారకార్యకలాపాలు నిర్వహించక పోగా, తమ డబ్బులను తిరిగి ఇవ్వాలని అడిగితే తమపై ఎదురుదాడికి దిగుతున్నారని బాధితులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

అమెరికాలోనే పేపాల్‌ డాటా లీకేజీ!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2025 | 07:46 AM