Hyderabad: ధూల్‌పేట గంజాయి లేడీడాన్.. అంగూరుబాయ్‌పై పీడీ యాక్టు
ABN , Publish Date - Mar 12 , 2025 | 08:13 AM
ధూల్‌పేట గంజాయి లేడీడాన్ అంగూరుబాయ్‌పై పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు. కొన్నాళ్ల క్రితం బతుకుదెరువుకోసం మధ్యప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చిన లోధాస్ కుటుంబీకులు ధూల్‌పేట ప్రాంతంలో స్థిరపడ్డారు. అలా వచ్చిన వారిలో అంగూరుబాయ్ కుటుంచీకులు కూడా ఉన్నారు.

- ఇప్పటి వరకు 30కి పైగా కేసులు
హైదరాబాద్ సిటీ: గంజాయి స్మగ్లింగ్‌లో లేడీడాన్‌గా పేరు గాంచిన అంగూరుబాయ్(Angurubai)పై ఎక్సైజ్ పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కలెక్టర్ ఆమోదముద్ర వేసినట్లు ధూల్‌పేట ఇన్‌స్పెక్టర్ మధుబాబు(Dhoolpet Inspector Madhubabu) తెలిపారు. కొన్నాళ్ల క్రితం బతుకుదెరువుకోసం మధ్యప్రదేశ్ నుంచి నగరానికి వలస వచ్చిన లోధాస్ కుటుంబీకులు ధూల్‌పేట ప్రాంతంలో స్థిరపడ్డారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వ్యాపారం పేరిట భారీ మోసం.. రూ.18 కోట్ల మేరకు..
అప్పట్లో గుడుంబా (నాటుసారా) వ్యాపారం చేసేవారు. నాటుసారా వ్యాపారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన తర్వాత గంజాయి అమ్మకాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలో గంజాయి స్మగ్లింగ్ చేయడంలో అరితేరిన అంగూరుబాయ్ లేడీ డాన్‌గా ఎదిగింది. ఎన్నోసార్లు ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు చిక్కిన అంగూరు బాయ్.. జైలుకు వెళ్లివచ్చినా పద్ధతి మార్చుకోలేదు. ఆమెతో పాటు.. ఆమె కుటుంబంలో ఉన్న 14 మంది గంజాయి స్మగ్లింగ్‌లో ఆరితేరినట్లు పోలీసులు గుర్తించారు.
రెండు నెలల క్రితం పోలీసులకు చిక్కి అరెస్టయిన అంగూరుబాయ్‌పై ధూల్‌పేట పోలీసులు పీడీ యాక్టు నమోదుకు సిఫారస్సు చేశారు. ఎక్సైజ్ పోలీసుల సిఫారసును పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఆమెపై పీడీయాక్టు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ లేడీడాన్‌పై ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లలో 30కి పైగా కేసులు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లంచాలు మరిగి.. వలకు దొరికి.. !
అమెరికాలోనే పేపాల్ డాటా లీకేజీ!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు
Read Latest Telangana News and National News