Share News

Student: ఆ విద్యార్థినికి ఎంత కష్టం వచ్చిందో పాపం...

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:29 AM

కొద్దిసేపట్లో పరీక్ష ప్రారంభం కానుండగా మరోపక్క తండ్రి మరణించడంతో ఆ విద్యార్థినికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ కష్టం మరెవరికీ రాకూడదంటూ అక్కడున్న వారు అనుకోవడం జరిగింది.

Student: ఆ విద్యార్థినికి ఎంత కష్టం వచ్చిందో పాపం...

- కొద్దిసేపట్లో పరీక్ష అనగా తండ్రి మృతి

- పుట్టెడు దుఃఖంతోనే హాజరు

చెన్నై: చిన్న వయసులో ఎంత కష్టమొచ్చింది.. మరికొద్ది సేపట్లో ప్లస్‌టూ పరీక్షకు హాజరుకావాల్సివుండగా తండ్రి కన్నుమూశాడు. పుట్టెడు దుఃఖం ముంచుకొస్తున్నా.. గుండెను దిటవు చేసుకున్న ఆ బాలిక.. కన్నీటిని ఆపుకుంటూ, భవితను వెతుక్కుంటూ ప్లస్‌టూ పరీక్షకు హాజరైంది. తిరునల్వేలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. దిశన్‌విలై(Dishanvilai) తాలూకా ఇట్టమొలి సమీపం వడవిలై గ్రామానికి చెందిన అయ్యాదురై (55) భానుమతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Rajnath Singh: డీలిమిటేషన్‌తో సీట్ల సంఖ్యపై రాజ్‌నాథ్ క్లారిటీ


వీరిలో మూడో కుమార్తె మధుమిత ప్లస్‌ టూ చదువుతోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న అయ్యాదురై మంగళవారం వేకువజామున మృతిచెందాడు. మధుమిత(Madhumitha) మరికొద్దిసేపట్లో గణితం పరీక్ష రాయాల్సి ఉంది. అయ్యాదురై మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి తీసుకొచ్చారు. దీంతో కుటుంబీకులు, బంధువులంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు.


అప్పటి వరకూ గుండెలవిసేలా రోదించిన మధుమితకు.. గతంలో తండ్రి చెప్పిన మాటలు స్మరణకొచ్చాయో, లేక కర్తవ్యం గుర్తుకొచ్చిందో గానీ.. హాల్‌టిక్కెట్‌తో పరీక్షకు వెళ్లేందుకు సిద్ధమైంది. తండ్రి భౌతికకాయానికి నమస్కరించి పరీక్షకు హాజరైంది. ఆమె పరీక్ష నుంచి వచ్చాక అయ్యాదురైకి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన పలువురిని కంట తడిపెట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి:

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

అమెరికాలోనే పేపాల్‌ డాటా లీకేజీ!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2025 | 11:29 AM