Hyderabad: మేకప్‌మెన్ సహా మరో యువకుడి కిడ్నాప్
ABN , Publish Date - Apr 05 , 2025 | 07:57 AM
బుల్లితెర నటుల వ్యక్తిగత మేకప్మెన్తోపాటు మరో యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన వారిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే.. ఈ సంఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు నిరకవహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

- అడవుల్లోకి తీసుకువెళ్లిన నకిలీ పోలీసులు
- పారిపోయిన వారి ఆచూకీ చెప్పాలని చిత్రహింసలు
- పోలీసుల సహాయంతో రక్షించిన బుల్లితెర నటుడు
హైదరాబాద్: పారిపోయిన ప్రేమికుల ఆచూకీ చెప్పాలని బుల్లితెర నటుల వ్యక్తిగత మేకప్మెన్తోపాటు మరో యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన వారిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్(Jubilee Hills Police Station)లో కేసు నమోదైంది. మేక్‌పమెన్‌ను తీసుకెళ్లింది నకిలీ పోలీసులని తెలుసుకున్న నటుడు పోలీసుల సహాయంతో వారిని రక్షించాడు. వివరాలిలా ఉన్నాయి.
బుల్లితెర నటులు ఇంద్రనిల్, మేఘనకు పర్సనల్ మేకప్‌మెన్‌గా ఏపీకి చెందినభూమిరెడ్డి కిషోర్‌రెడ్డి చాలాకాలంగా పనిచేస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Sri Rama Navami: శ్రీరామ నవమి శోభాయాత్రకు పటిష్ఠ బందోబస్తు
కృష్ణానగర్‌లో ఇరదాసు సందీప్, పల్లె శివతో కలిసి ఓ ఇంట్లో అద్దెకుండేవాళ్లు. కొద్దిరోజులుగా శివ మరో వర్గానికి చెందిన యువతితో సహజీవనం చేస్తూ ఇటీవల ఆమెను తీసుకొని నగరం వదిలి వెళ్లిపోయాడు. అయితే, ఈనెల 2న తెల్లవారుజామున భూమిరెడ్డి ఉంటున్న ఇంటి వద్దకు పోలీసు స్టిక్కర్ ఉన్న నంబర్‌ప్లేట్ లేని కారు వచ్చింది. అందులో నుంచి దిగిన ఇద్దరు తాము పోలీసులమని, శివ ఆచూకీ చెప్పాలని భూమిరెడ్డి, సందీ్‌పను బలవంతంగా కారు ఎక్కించారు.
జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళతామని చెప్పి తుక్కుగూడలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడికి మరో రెండు వాహనాల్లో వచ్చిన మరో పదిమంది కలిసి భూమిరెడ్డి, సందీప్‌లను కట్టేసి శివ, ఆ యువతి ఆచూకీ చెప్పాలంటూ తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని అచ్చంపేటకు తీసుకువెళ్లారు. ఇదిలాఉండగా, భూమిరెడ్డి విధుల్లోకి రాకపోవడంతో నటుడు ఇంద్రనీల్‌కు అనుమానం వచ్చింది. వారిని తీసుకెళ్లింది నకిలీ పోలీసులని తేలింది.
దీంతో భూమిరెడ్డికి ఇంద్రనీల్ ఫోన్ చేయగా కిడ్నాపర్లు లైన్‌లోకి వచ్చి మాట్లాడారు. అనంతరం సందీప్, భూమిరెడ్డిలను అచ్చంపేట పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇంద్రనీల్ కూడా అక్కడకు చేరుకొని వారిని నగరానికి తీసుకున్నాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు సోహెల్, ఇబ్బుతో పాటు మరికొందరిపై కిడ్నాప్, దాడి తదితర సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..
Read Latest Telangana News and National News