Share News

Hyderabad: గుండెపోటుతో బస్టాపులో వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 21 , 2025 | 08:40 AM

విధులకు హాజరయ్యేందుకు బస్సులో వచ్చి బస్టాపులోనే కుప్పకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖైరతాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ అమర్‌నాధ్‌ ఏఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ ఐసీఐసీఐ బ్యాంకు సమీపంలో ఉన్న బస్టాపులో ఓ వ్యక్తి పడిపోయాడని సమాచారం రావడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.

Hyderabad: గుండెపోటుతో బస్టాపులో వ్యక్తి మృతి

హైదరాబాద్: విధులకు హాజరయ్యేందుకు బస్సులో వచ్చి బస్టాపులోనే కుప్పకూలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖైరతాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ అమర్‌నాధ్‌(Khairatabad Police Station SI Amarnath), ఏఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌ ఐసీఐసీఐ బ్యాంకు(Khairatabad ICICI Bank) సమీపంలో ఉన్న బస్టాపులో ఓ వ్యక్తి పడిపోయాడని సమాచారం రావడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అతడిని పరీక్షించి గుండెపోటుతో చనిపోయినట్లు నిర్ధారించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఏటీఎం సెంటర్లే టార్గెట్‌.. అమాయకుల దృష్టి మరల్చి కార్డుల చోరీ


అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు అతడి జేబులో లభించిన ఆధారాల మేరకు ఓ వార్తా పత్రిక కార్యాలయంలో ఫైనాన్స్‌, అకౌంట్స్‌ విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న పి.శేషచలపతిరావు(55)గా గుర్తించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శేషచలపతిరావు(Seshachalapathi Rao) ఒక్కడే అల్వాల్‌లో ఉంటున్నాడని, అతడి స్వస్థలమైన విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో భార్య ఉంటున్నట్లు తెలిసింది. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి గాంధీఆస్పత్రికి తరలించామని, కుటుంబీకులు వచ్చిన తర్వాత వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2025 | 08:40 AM