Secunderabad: కుషాయిగూడలో వృద్ధురాలి హత్య
ABN , Publish Date - Apr 15 , 2025 | 08:20 AM
సికింద్రాబాద్ కుషాయిగూడలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోనే ఆమెను హత్య చేశారు. ఆమెను వారం క్రితమే హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. ఇంట్లోనుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా వృద్ధురాలు హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

- వంటగదిలో కుళ్లిన స్థితిలో మృతదేహం
సికింద్రాబాద్: కుషాయిగూడ(Kushaiguda)లో ఓ వృద్ధురాలు హత్యకు గురైంది. సోమవారం ఇంట్లోంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులు వెళ్లి చూడగా గాయంతో రక్తపుమడుగులో మృతిచెంది కనిపించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన పుఖ్‌రాజ్ చౌదరి, కమలాదేవి(70) దంపతులు చాలా కాలంక్రితమే నగరానికి వలస వచ్చి హెచ్‌బీకాలనీ కృష్ణానగర్ రోడ్ నంబరు 5లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ వృద్ధుడు నిజంగా చాలా అదృష్టవంతుడే.. ఏం జరిగిందంటే..
ఫుఖ్‌రాజ్ చౌదరి పదేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి సంతానం లేకపోవడంతో కమలాదేవి ఒంటరిగానే ఉంటున్నారు. ఇంటి అద్దె ద్వారా వచ్చే సొమ్ముతో ఆమె జీవనం సాగిస్తోంది. అయితే, సోమవారం ఆమె ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు కుషాయుగూడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సదరు ఇంటి తలుపులు తెరచి చూడగా వంటగది సమీపంలో కమలాదేవి రక్తపు మడుగులో కుళ్లిన స్థితిలో మృతి చెంది ఉంది.
మృతదేహాన్ని పరిశీలించి తలకు బలమైన గాయమైనట్లు పోలీసులు గుర్తించారు. దీనిని హత్యగా అనుమానిస్తున్నారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కమలాదేవి హత్యకు ఆస్తి తగాదాలే కారణమా..? లేక లేక ఆస్తి కాజేయాలని తెలిసిన వారే ఎవరైనా హత్య చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇంటి పరిసరాల సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఓ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి
ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!
తెలంగాణలో కలకలం రేపిన అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు
Read Latest Telangana News and National News