Hyderabad: అమ్మో.. రూ.24.84 లక్షలు కొట్టేశారుగా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 22 , 2025 | 08:01 AM
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఈ సైబర్ మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్ కు చెందిన వ్యాపారి ఒకరు సైబర్ మోసానికి బలయ్యారు.

- ట్రేడింగ్ పేరుతో రూ.24.84 లక్షలు స్వాహా
- ఖాతాలో రూ.97.47 లక్షలు వచ్చినట్లు చూపించి మోసం
హైదరాబాద్ సిటీ: తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) నగరవాసి నుంచి రూ.24.84 లక్షలు కాజేశారు. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన వ్యాపారి (49)కి సైబర్ నేరగాడు ఫోన్ చేసి స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పాడు. ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించి రూ.5వేలు పెట్టుబడి పెట్టించాడు. రూ.5వేలకు నాలుగింతల లాభం రూ.20 వేలు వచ్చినట్లు వెబ్‌సైట్(Website)లో చూపించాడు.
ఈ వార్తను కూడా చదవండి: CP Sudheer Babu: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా ఐపీఎల్
విత్‌డ్రా అవకాశం కూడా కల్పించాడు. వాట్సప్ గ్రూప్‌లో చేర్పించి, ఎస్‌ఎంఈ ఐపీఓలు కొనుగోలు చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించి వివిధ ఖాతాలకు రూ.24.84 లక్షలు బదిలీ చేయించాడు. కొద్ది రోజులకే రూ.97.47 లక్షలు వచ్చినట్లు వెబ్‌సైట్‌లో చూపించాడు. అయితే, విత్‌డ్రా ఆప్షన్ లేకపోవడంతో ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ చార్జీలు పెంచడం లేదు
మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News