Share News

అమ్మ చెప్పిన కథ

ABN , Publish Date - Apr 07 , 2025 | 03:48 AM

కరెంట్ పోయిన చీకట్లో కొవ్వొత్తిని వెలిగిస్తూ ఆ తల్లి ఇలా చెప్పింది ‘‘పిచ్చి కన్నా, చలేస్తే పిట్టలు ఆకుల్ని కప్పుకుంటాయి ఆకులు ఆకాశాన్ని కప్పుకుంటాయి, ఆకాశం చుక్కల్నీ చుక్కలు...

అమ్మ చెప్పిన కథ

ప్రియ పద్యం

‘‘అమ్మా చలేస్తే, మనం దుప్పట్లు కప్పుకుంటాం. మరి పిట్టలూ?’’

కరెంట్ పోయిన చీకట్లో కొవ్వొత్తిని వెలిగిస్తూ ఆ తల్లి ఇలా చెప్పింది ‘‘పిచ్చి కన్నా, చలేస్తే పిట్టలు ఆకుల్ని కప్పుకుంటాయి ఆకులు ఆకాశాన్ని కప్పుకుంటాయి, ఆకాశం చుక్కల్నీ చుక్కలు నీ కళ్ళనీ కప్పుకుంటాయి. నీ కళ్ళని అమ్మా, అమ్మని నాన్నా, నాన్నని నీ తమ్ముడూ నీ తమ్ముడ్ని తాతా, తాతని నాయనమ్మా నాయనమ్మని ఈ ఇల్లూ కప్పుకుంటుంది. ఈ ఇంటిని వేపచెట్టూ, వేపచెట్టుని నేలా, నేలను గాలీ మరి గాలిని పచ్చని చేలూ, చేలని నీరూ, నీరుని నిప్పూ కప్పుకుంటాయి. ఇక పూలని పురుగులూ, పురుగులని పుట్టలూ, పుట్టల్ని పాములూ పాములని పరమ శివుడూ, ఆ శివుడిని పార్వతీ, పార్వతిని ఈ భూమీ, ఈ భూమిని పగలూ రాత్రీ మార్చిమార్చి కప్పుకుంటాయి. ఇక పడుకుందామా?’’ అని తను తల తిప్పి పక్కకు చూసేటప్పటికి, మంచంపై పిట్టలూ ఆకులూ పూవులూ చుక్కలూ, నింగీ నేలా నీరూ నిప్పూ గూళ్ళూ చెట్లూ పుట్టలూ పురుగులూ, పగలూ రాత్రీ వెన్నెల వాసనా, చల్లటి నిద్రా తెరలు తెరలుగా కదులాడే గంధపు వదనంతో ఒక పిల్లవాడు అలా నోరు తెరుచుకుని నిదురపోయి ఉన్నాడు!

శ్రీకాంత్‌

ఇవి కూడా చదవండి..

Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ

Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ

For National News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 03:48 AM