ఈ వారం వివిధ కార్యక్రమాలు 7 04 2025
ABN , Publish Date - Apr 07 , 2025 | 03:38 AM
‘బందారం కథలు’ ఆవిష్కరణ, రెండుతరాల కవిసంగమం, అవార్డుల ప్రదానోత్సవ సభ, వి. చంద్రశేఖర రావు పురస్కారం, బాలల నవలల పోటీ ఫలితాలు, కవితల పోటీ...

‘బందారం కథలు’ ఆవిష్కరణ
నందిని సిద్ధారెడ్డి కథా సంపుటి ‘బందారం కథలు’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 8 సా.4.30నిమిషాలకు ప్రెస్‌క్లబ్, సిద్దిపేటలో జరుగుతుంది. అధ్యక్షత కె. రంగాచారి; ముఖ్య అతిథి కె. శ్రీనివాస్; ఆత్మీయ అతిథి దేశపతి శ్రీనివాస్; సమీక్ష వి. శంకర్; ఆత్మీయ సందేశం తైదల అంజయ్య, పొన్నాల బాలయ్య.
సిద్దెంకి యాదగిరి
రెండుతరాల కవిసంగమం
పై కార్యక్రమం ఏప్రిల్ 12 సా.6 గంటలకు నిజాం కాలేజి, బషీర్ బాగ్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఏనుగు నరసింహారెడ్డి, రహీమొద్దీన్, శ్రీనిధి విప్లవశ్రీ, సందీప్ వొటారికారి, అరవింద్ మైలారపు పాల్గొంటారు.
కవి యాకూబ్
అవార్డుల ప్రదానోత్సవ సభ
చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బండారు ప్రసాదమూర్తి ప్రధాన అవార్డును స్వీకరిస్తారు. ఈ సభ ఏప్రిల్ 13 సాయంత్రం నెల్లూరు పురమందిరం ఏసీ హాలులో జరుగుతుంది. ముఖ్యఅతిథి షేక్ అబ్దుల్ అజీజ్, అధ్యక్షత తుంగా శివప్రభాత్ రెడ్డి, విశిష్ట అతిథి మాడభూషి సంపత్ కుమార్. సభలో పి. శ్రీనివాస్ గౌడ్, కొమ్మవరపు విల్సన్ రావు, అవధానుల మణిబాబు సాహితీ పురస్కారాలను స్వీకరిస్తారు. కవి సమ్మేళనం వుంటుంది.
చిన్ని నారాయణరావు
వి. చంద్రశేఖర రావు పురస్కారం
వి. చంద్రశేఖర రావు జయంతి, పురస్కార సభ ఏప్రిల్ 13 సా.6గంటలకు 2/7, బ్రాడీపేట, కొరటాల భవన్ (సిపియం ఆఫీస్), గుంటూరులో జరుగుతుంది. కథకుడు కె.వి.మేఘనాధ్ రెడ్డి పురస్కారం స్వీకరిస్తారు. సభలో పెనుగొండ లక్ష్మీ నారాయణ, ఎ.కె. ప్రభాకర్, వాసిరెడ్డి నవీన్, కందిమళ్ళ శివప్రసాద్, కాట్రగడ్డ దయానంద్ పాల్గొంటారు.
వి. ప్రసూన
బాలల నవలల పోటీ ఫలితాలు
తానా – మంచి పుస్తకం ఆధ్వర్యంలో జరిగిన బాలల నవలల పోటీలో ఎంపికైన రచయితలు: ఆర్.సి. కృష్ణస్వామి రాజు (‘కుంటోళ్ల కొట్టం’), పాణ్యం దత్త శర్మ (‘మనకు మనుషులు కావాలి’), శాఖమూరి శ్రీనివాస్ (‘చతుర్ముఖం’), ఎం. సుగుణ రావు (‘ఆలీబాబా అయిదుగురు స్నేహితులు’), పి. యుగంధర్ (‘జాను అనే నేను, నా స్నేహితురాళ్లు’). ఒక్కొక్కరూ రూ.15వేల పారితోషికాన్ని స్వీకరిస్తారు.
పి. భాగ్యలక్ష్మి
కవితల పోటీ
వాసా ప్రభావతి స్మారకంగా వాసా ఫౌండేషన్ – పాలపిట్ట సంయుక్తంగా నిర్వహిస్తున్న కవితల పోటీకి ఎక్కడా ప్రచురితం కాని, పోస్టు చేయని వచన కవితలను ఏప్రిల్ 30లోగా పంపాలి. ఇతివృత్తం ఏద యినా పరవాలేదు. మొదటి, రెండో, మూడో బహుమతులు వరుసగా: రూ.3వేలు, 2 వేలు, 1000. ఎనిమిది కవితలకు రూ.500 ప్రత్యేక బహుమతులు. చిరునామా: ఎడిటర్, పాలపిట్ట, ఫ్లాట్ నెం. 2, బ్లాక్–6, ఎం.ఐ.జి–2, ఏపిహెచ్‌బి, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్–500 044. ఫోన్: 98487 87284, ఈమెయిల్: palapittamag@ gmail.com
పాలపిట్ట
ఇవి కూడా చదవండి..
Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ
Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది
Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ
For National News And Telugu News