Hyderabad: 8 నిమిషాల్లోనే ఆపరేషన్..
ABN , Publish Date - Apr 09 , 2025 | 08:42 AM
ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు మన ప్రభుత్వాసుపత్రి వైద్యులు. అమీర్‌పేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు ఓ గర్భిణికి అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించి తల్లి, శిశువును కాపాడారు. సమస్య తీవ్రతను గుర్తించి కేవలం 8 నిమిషాల్లో అత్యవసర శస్త్రచికిత్స చేసి ఔరా అనిపించుకున్నారు.

- తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన గర్భిణి..
- తల్లీబిడ్డను కాపాడిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు
హైదరాబాద్: అమీర్‌పేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు(Ameerpet Government General Hospital Doctors) ఓ గర్భిణికి అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించి తల్లి, శిశువును కాపాడారు. సమస్య తీవ్రతను గుర్తించి కేవలం 8 నిమిషాల్లో అత్యవసర శస్త్రచికిత్స చేసి ఔరా అనిపించుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బాలానగర్‌కు చెందిన నెలలు నిండిన గర్భిణి యాస్మిన్(23) రక్తస్రావ సమస్యతో ఈనెల 5న ఉదయం 10 గంటలకు అమీర్‌పేటలోని 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పెద్దప్లానే వేశారుగా.. రూ.10 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా
అత్యవసర కేసుగా పరిగణిస్తూ గైనిక్ బృందం యాస్మిన్‌కు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భసంచికి అతుక్కుని ఉండాల్సిన మాయా విడిపోవడమే రక్త స్రావానికి కారణమనే విషయాన్ని గుర్తించి, వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. మెరుగైన చికిత్స కోసం నిలోఫర్ వంటి పెద్ద ఆస్పత్రికి తరలించే సమయం లేకపోవడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహ్మద్ రావూఫ్, ఆర్‌ఎంవో డాక్టర్ వినాయక్‌లు ఆపరేషన్‌కు అనుమతించారు.
దీంతో గైనిక్ బృందం వెంటనే అనస్తీషియా, పీడియాట్రిక్ విభాగం వైద్యులతో కలిసి కేవలం 8 నిమిషాల్లో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి ఇద్దరినీ కాపాడారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు పూర్తిగా కోలుకున్నారు. పూర్తి స్థాయిలో ఆస్పత్రిలో వసతులు లేకపోయినా ధైర్యంగా ఆపరేషన్ చేసిన వైద్యుల బృందాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎంవో అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News