Fast Weight Loss Tips: ఎంత ట్రై చేసిన బరువు తగ్గలేకపోతున్నారా.. ఇలా చేస్తే ప్రాబ్లం సాల్వ్..
ABN , Publish Date - Apr 12 , 2025 | 02:11 PM
How To Lose Weight Fast: కొంతమంది చాలా వేగంగా బరువు పెరిగిపోతుంటారు. వర్కవుట్లు, ఆహారం ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకున్నా ఊబకాయ సమస్య మాత్రం తగ్గించుకోలేకపోతుంటారు. ఈ 5 కారణాల వల్లే ఇలా జరుగుతుంది. ముందు వీటిపై దృష్టి పెడితే ఆటోమేటిగ్గా అధిక బరువు సమస్య పరిష్కరమవుతుంది.

Reasons of Rapid Weight Gain and Solutions: ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ సమస్య పెరిగిపోతోంది. వ్యాయామం, ఆహారం, లైఫ్ స్టైల్ ఇలాంటి కారణాల అధిక బరువు సమస్య ఎదుర్కొంటున్నవారు కొందరైతే.. అకారణంగా ఊబకాయ బాధితులుగా మారుతున్నవారు మరికొందరు. ఇందుకు శరీరంలో హార్మోన్ల అసమతుల్యతనే కారణం. ఈ 5 హార్మోన్ల వల్లే బరువు తగ్గడం కష్టతరంగా మారుతుంది. వీటిని అదుపు చేసేందుకు ఈ చర్యలు తీసుకోవడం మొదలుపెడితే సునాయసంగా ఊబకాయ సమస్య నుంచి రిలీఫ్ పొందుతారు.
ఇన్సులిన్ హార్మోన్
ఇన్సులిన్ హార్మోన్ ప్యాంక్రియాస్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా శరీరంలోని గ్లూకోజ్ స్థాయి ప్రభావితమవుతుంది. ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో కొవ్వు నిల్వ ఉండటం ప్రారంభమవుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ కొవ్వు తరగదు. అందువల్ల ఇన్సులిన్ హార్మోన్ స్థాయిని తగ్గించడానికి ప్రతిరోజూ మెంతుల గింజలను నానబెట్టి ఉదయం ఒక చెంచా మెంతుల గింజలను నమలండి లేదా ఈ నానబెట్టిన విత్తనాల నీటిని ఖాళీ కడుపుతో తాగండి.
కార్టిసాల్ హార్మోన్
మీరు ఎక్కువ ఒత్తిడి, టెన్షన్ తీసుకుంటే శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా అలసట, బలహీనంగా ఉన్న భావన కలిగినట్లయి మన మెదడుకు సంకేతం వెళుతుంది. అలా జరిగితే శరీరంలో కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. కాబట్టి, బరువు తగ్గడానికి వర్కవుట్లు, డైట్ మాత్రమే సరిపోవు. మానసిక స్థాయిని కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే శరీరంలో కార్టిసాల్ స్థాయి పెరగదు. బరువు తగ్గడం సులభం అవుతుంది. కార్టిసాల్ హార్మోన్‌ను నియంత్రించడానికి ప్రతి రాత్రి పడుకునే ముందు అర టీస్పూన్ అశ్వగంధ పొడిని వేడి పాలు లేదా నీటిలో కలిపి తాగాలి.
గ్రెలిన్ హార్మోన్
మీకు చాలా ఆకలిగా అనిపిస్తే దానికి కారణం గ్రెలిన్ హార్మోన్. ఈ హార్మోన్ విడుదలలో అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆహారం ఎక్కువగా తింటారు. ఫలితంగా బరువు పెరగడం మొదలవుతుంది. కాబట్టి, ఈ హార్మోన్ స్థాయిని సరిచేయడానికి రోజూ వేడి నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపండి లేదా హెర్బల్ టీ తయారు చేసి భోజనానికి ముందు తీసుకోండి.
ఈస్ట్రోజెన్ హార్మోన్
ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే కూడా బరువు వేగంగా పెరుగుతారు. ఈ హార్మోన్ స్థాయిని సమతుల్యం చేయడానికి ప్రతిరోజూ ఒక చెంచా అవిసె గింజలను గోరువెచ్చని నీటిలో లేదా సలాడ్‌లో కలిపి తినండి.
లెప్టిన్ హార్మోన్
తిన్న తర్వాత సంతృప్తిని కలిగించే హార్మోన్ లెప్టిన్. ఆహారం శరీరంలోకి ప్రవేశించినప్పుడు లెప్టిన్ హార్మోన్ కారణంగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువగా తినాలని అనిపించదు. ఒకవేళ లెప్టిన్ హార్మోన్ విడుదలలో అసమతుల్యత ఏర్పడితే కడుపు నిండినట్లు అనిపించక ఎక్కువ తింటారు. అందుకే, మీరు ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గడం కష్టం అవుతుంది. లెప్టిన్ హార్మోన్‌ను సక్రియం చేయడానికి ప్రతి రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు లేదా నీటిలో అర టీస్పూన్ పసుపు, నల్ల మిరియాలు కలిపి తాగాలి. ఇది లెప్టిన్ హార్మోన్ స్థాయిని సమతుల్యం చేస్తుంది. కడుపు నిండినట్లు అనిపించిన తర్వాత మీరు సంతృప్తి చెందుతారు.
Read Also: Diabetes Solutions: షుగర్ కంట్రోల్ కోసం.. రాందేవ్ బాబా చెప్పిన 5 చిట్కాలు..
Mango Juice: మ్యాంగో జ్యూస్ తాగుతున్నారా.. ఈ 7 సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్నా ప్రమాదమే..
Cucumber: మార్కెట్లో మంచి దోసకాయను గుర్తించడం ఎలా..