Hyderabad: నాలుగు రోజుల శిశువుకు అరుదైన సర్జరీ
ABN , Publish Date - Jan 17 , 2025 | 08:42 AM
శిశువుకు పుట్టుకతో ఏర్పడని డయాఫ్రంతో ఇబ్బంది పడుతున్న నాలుగు రోజుల శిశువుకు వైద్యులు అరుదైన సర్జరీ(Surgery) చేశారు. సౌదీ అరేబియాలో ఉంటున్న ఒక జంటకు పుట్టిన శిశువుకు గుండె భాగానికి, ఉదర భాగానికి మధ్య ఒక గోడ లాంటి డయాఫ్రం లేదు.

హైదరాబాద్ సిటీ: శిశువుకు పుట్టుకతో ఏర్పడని డయాఫ్రంతో ఇబ్బంది పడుతున్న నాలుగు రోజుల శిశువుకు వైద్యులు అరుదైన సర్జరీ(Surgery) చేశారు. సౌదీ అరేబియాలో ఉంటున్న ఒక జంటకు పుట్టిన శిశువుకు గుండె భాగానికి, ఉదర భాగానికి మధ్య ఒక గోడ లాంటి డయాఫ్రం లేదు. దీనివల్ల కడుపు, కాలేయం, మూత్రపిండాలు అన్నీ గుండె భాగంలోకి వచ్చేశాయి. ఈ శిశువుకు కీహోల్ సర్జరీ చేసి ప్రాణాలను కాపాడినట్లు బంజారాహిల్స్(Banjara Hills)లోని లిటిల్ స్టార్ అండ్ షి ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఆస్పత్రి సీనియర్ నియోనటాలజిస్టు డాక్టర్ సతీష్ గంట తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఫేస్‌బుక్ పరిచయం అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..
గురువారం ఆస్పత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రసవం కోసం హైదరాబాద్‌కు వచ్చిన సౌదీ అరేబియా జంట ఆస్పత్రికి రావడంతో గర్భిణికి అన్ని రకాల పరీక్షలు చేసి శిశువుకు డయాఫ్రం లేదని గుర్తించామని, ప్రసవం తర్వాత శిశువుకు సర్జరీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. గత నెల 23వ తేదీన సర్జరీ చేశామని, మూడున్నర వారల్లోనే డిశ్చార్జి చేసి పంపించనున్నట్లు తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News