Drinking Water: భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం తప్పా.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:31 AM
Drinking Water During Eating : భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగకూడదని చాలామంది తరచూ చెప్తూ ఉంటారు. చెప్పడమే కాదు. పాటిస్తారు కూడా. ఇంతకీ ఈ అలవాటు సరైనదేనా? తినేటప్పుడు నీళ్లు తాగాలా? వద్దా? దీనిపై డాక్టర్లు ఏమని చెబుతున్నారు.

Drinking Water When Eating : అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు తాగటం మంచిది కాదు. తినడం పూర్తయిన తర్వాతే నీళ్లు తాగాలని చాలామంది అంటూ ఉంటారు. చెప్పటమే కాదు. స్వయంగా పాటిస్తుంటారు కూడా. ఇలా భోజనం మధ్యలో నీళ్లు తాగితే సరిగా అరుగుదల కాదని, జీర్ణవ్యవస్థ మందగిస్తుందని కూడా అదే పనిగా చెప్తుంటారు. ఇందులో నిజమెంత? ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగే అలవాటు మంచిదా? కాదా? దీని గురించి వైద్య నిపుణులు ఏమని సలహా ఇస్తున్నారు.. అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం..
భోజనం మధ్యలో గొంతు పట్టుకుపోయినట్లు అనిపించినా, దాహం వేసినా తినడం పూర్తయ్యేవరకూ నీళ్లు తాగద్దని స్ట్రిక్ రూల్స్ పాటిస్తుంటారు చాలామంది ప్రజలు. నిజానికి ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగడం పెద్ద తప్పు కాదని చాలా తక్కువమందికే తెలుసు. అయితే, ఇందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ కింది జాగ్రత్తలు పాటించి ఆహారంతో పాటు నీళ్లు తీసుకున్నా అదేం పెద్ద నేరం కాదని అంటున్నారు వైద్య నిపుణులు.
భోజనానికి ముందు, తర్వాత నీళ్లు తాగొచ్చా..
ఆహారం తినే ముందు, తిన్న తర్వాత , భోజనం చేసే సమయంలో నీరు తాగే విషయంలో అనేక నియమాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఆహారం తినడానికి కనీసం అరగంట ముందు నీరు తాగాలి. తినే ముందు నీరు తాగితే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.అదే సమయంలో ఆహారం తీసుకున్న వెంటనే నీరు తాగడం కూడా సరైన పద్ధతి కాదు. ఈ అలవాటు జీర్ణక్రియను నెమ్మదింపజేయడమే కాకుండా శరీరంలో కఫం ఏర్పడి బరువు పెరగడానికి కారణమవుతుంది.
ఆహారంతో పాటు నీరు ఎలా తాగాలి..
ఆహారం తినే ముందు, తర్వాత నీరు తాగకూడదు. అదేవిధంగా భోజనం మధ్యలో కూడా. ఎవరైనా నీరు తాగాలని భావిస్తే ఖచ్చితంగా ఈ విషయాలను గుర్తుంచుకోండి. అప్పుడు ఎటువంటి హాని ఉండదు.
భోజనం చేసేటప్పుడు నీరు అవసరం అనిపిస్తే వెంటనే నీరు త్రాగాలి.
చాలాసార్లు ఆహారం గొంతులో ఇరుక్కుపోతుంది. అలాంటి సమయంలో తప్పనిసరిగా నీళ్లు తాగాలి. అప్పుడే ఆహారం సులభంగా గొంతులోకి దిగుతుంది.
మీరు నీళ్లు తాగినప్పుడల్లా గుటకలు వేసి తాగండి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం సమస్య తలెత్తదు. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ నీరు తాగితే అపానవాయువు సమస్య వస్తుంది.
అన్నం తినే సమయంలో దాహమేస్తే గోరువెచ్చని నీళ్లు తాగండి. మీ జీర్ణక్రియ మందగించకుండా ఉంటుంది.
భోజనం మధ్యలో ఒకేసారి ఎక్కువ నీరు తాగడం మానుకోండి. ముద్దను పూర్తిగా మింగిన తర్వాతే ఒకటి లేదా రెండు గుక్కల నీళ్లు తాగండి. తేమ కారణంగా ఆహారం కూడా సులువుగా గొంతులోంచి కడుపులోకి జారుతుంది. జీర్ణక్రియకు కూడా ఎటువంటి ఆటంకం కలగదు.
ఆహారంతో పాటు నీరు తాగేటప్పుడు వీళ్లు జాగ్రత్తగా ఉండాలి..
పేగు సంబంధిత సమస్యలు, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ తో బాధపడేవారు అవసరమైన సమయంలో మాత్రమే భోజనం మధ్య నీరు సేవించాలి. వీలైనంత వరకూ పూర్తిగా నివారించడమే మంచిది.
Read Also : Memory Boosting Exercise: మెమోరీ పవర్ తగ్గినట్టు అనిపిస్తోందా.. ఇవి పాటిస్తే మైండ్ షార్ప్ అవడం పక్కా..
Diabtetes Control Tips : ఈ 3 డ్రింక్స్ తాగితే.. షుగర్ సహా 4 వ్యాధుల నుంచి రిలీఫ్..