Share News

Tea Effects: టీ తాగిన తర్వాత మీ కడుపు ఉబ్బిపోతుందా.. కారణం ఏమిటో తెలుసుకోండి

ABN , Publish Date - Apr 09 , 2025 | 06:48 PM

Tea Effects On Stomach: ఒక కప్పు వేడి టీతో దినచర్యను ప్రారంభించే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ కొంతమంది టీ తాగిన తర్వాత అపానవాయువు సమస్యతో బాధపడుతుంటారు. టీ తాగిన వెంటనే కడుపు ఉబ్బరం కలిగి ఈ సమస్య ఏర్పడుతుంటే అందుకు కారణమిదే..

Tea Effects: టీ తాగిన తర్వాత మీ కడుపు ఉబ్బిపోతుందా.. కారణం ఏమిటో తెలుసుకోండి
Tea Effects

Reasons For Bloating After Drinking Tea: వేసవి అయినా.. శీతాకాలమైనా.. టీని ఇష్టంగా తాగే వ్యక్తులు ఎందరో. తమ రోజును తప్పనిసరిగా ఒక కప్పు వేడి టీతో ప్రారంభిస్తారు టీ ప్రియులు. రోజులో ఏ సమయంలోనైనా దీన్ని తాగడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, ఈ అలవాటు కొంతమందికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. తాగిన వెంటనే కడుపు ఉబ్బిపోయి ఉబ్బరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలాసార్లు అపానవాయువు సమస్య రావచ్చు. అలా ఎందుకు జరుగుతుంది.. కారణాలేమిటో తెలుసుకోండి.


టీ తాగాక కడుపు ఉబ్బరం ఎందుకు మొదలవుతుంది?

భారతీయుల్లో ఎక్కువమంది ఇష్టంగా తాగే పానీయంగా ఛాయ్ ప్రసిద్ధి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడుతారు. టీని వివిధ ఫ్లేవర్స్, పదార్థాలతో తయారుచేసుకుని ఆస్వాదిస్తారు. టీలల్లో బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటి అనేక రకాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో చాలా మంది ప్రజలు పాలతో చేసిన టీ తాగడానికే ఇష్టపడతారు. ఉదయం నిద్రలేవగానే బెడ్ టీ తాగుతారు. టీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. ఖాళీ కడుపుతోనే టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. టీలో ఉండే కెఫిన్ కడుపులో ఆమ్లం ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపిస్తుంది. అందువల్ల కడుపు ఉబ్బినట్లయి అపానవాయువు సమస్య వస్తుంది. టీలోని ఆమ్ల గుణం వల్లే కడుపులో అసౌకర్యం పెరిగి ఉబ్బరం కలుగుతుంది.


ఎలా నివారించాలి?

టీ తాగిన తర్వాత మీ కడుపు ఉబ్బరం పెరుగుతున్నట్లు అనిపిస్తే మీరు టీ తయారు చేసే విధానాన్ని మార్చుకోవాలి. తీపి టీ తాగాలనుకుంటే చక్కెరకు బదులుగా, తేనె లేదా స్టెవియా వంటి సహజ పదార్థాలను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల టీ సులభంగా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య ఏర్పడదు. ఇది కాకుండా టీ తయారుచేసేటప్పుడు కొన్ని ఏలకులు వేయండి. టీ రుచిని పెంచడంతో పాటు జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆమ్లతను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ టీ తాగడం మానుకోండి.


Read also: Tips To Remove Tanning Skin: ఎండకు స్కిన్ ట్యాన్ అయిందా.. ఈ 5 చిట్కాలతో తక్షణమే మాయం..

Apple For Health: ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా.. ఎంతసేపటికి తాగాలో తెలుసుకోండి..

Tips for Diabetes: వేసవిలో డయాబెటిస్ గురించి మీరు

Updated Date - Apr 09 , 2025 | 06:49 PM