Share News

Earth Poles Video: భూభాగం అంతరించిపోతుందా.. మస్క్ వీడియో నిజమేనా

ABN , Publish Date - Apr 03 , 2025 | 09:25 AM

కలియుగాంతం సంభవిస్తుందా.. భూమి కనుమరుగు కానుందా.. మానవాళి తుడిచిపెట్టుకు పోవాల్సిందేనా.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. పైగా వీటికి ఇప్పుడు పక్కా ఆధారాలు కూడా చూపెడుతున్నారు. ఆ వివరాలు..

Earth Poles Video: భూభాగం అంతరించిపోతుందా.. మస్క్ వీడియో నిజమేనా

త్వరలోనే ప్రపంచం అంతరించిపోతుంది.. కలియుగాంతం సంభవిస్తోంది.. మానవజాతి తుడిచిపెట్టుకుపోనుంది అనే వార్తలు గత కొన్నేళ్లుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు అయితే ఓ అడుగు ముందుకు వేసి.. డేట్, టైమ్ కూడా చెబుతారు. మరి అవన్ని జరిగాయా.. అంటే లేదు. ఎందుకంటే ఇలాంటి వార్తలకు ఎలాంటి మూలం ఉండదు.. శాస్త్రీయ ఆధారాలు అసలే ఉండవు. ఎవరో కొందరు వ్యక్తులు, చారిత్రక గ్రంథాల్లో ఉన్న వాటి ఆధారంగా భూమి అంతం.. మానవాళి కనుమరుగు అనే వార్తలు వస్తుంటాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో మాత్రం ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అతి త్వరలోనే భూమి కనుమరుగవుతుంది అనే దానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ వీడియో. ఇంతకు దీనిలో ఏం ఉంది.. ఎందుకు జనాలు ఇంతలా భయపడుతున్నారంటే..


తాజాగా విడుదలైన వీడియో ప్రపంచ నాశనం గురించి పక్కా ఆధారాలతో నిరూపిస్తుంది. దీని ప్రకారం అతి త్వరలోనే భూమిని సముద్రుడు కబళించనున్నాడని స్పష్టం అవుతోంది. ఇంతకు ఆ వీడియోలో ఏం ఉంది.. ఎవరు రికార్డ్ చేశారంటే.. ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ భూధృవాలకు సంబంధించిన వీడియోని రికార్డ్ చేసింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

స్పేస్ ఎక్స్ ద్వారా నలుగురు వ్యక్తులు.. ది ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్లి.. ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసాన్ని చేశారు. భూమి మీద ఉన్న ఉత్తర, దక్షిణ ధృవాలను వీడియో తీశారు. 90 డిగ్రీల కోణంలో ఈ వీడియోలను రికార్డ్ చేశారు. దీనిలో ధృవ ప్రాంతంలోని మంచు దిబ్బలు కనువిందు చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి చూస్తుంటే.. మంచు కూడా నీలం రంగులో కనిపిస్తోంది.


అయితే ఈ వీడియోలో అద్భుతైమన దృశ్యాలు మాత్రమే కాక.. ప్రపంచాన్ని భయపెట్టే భయానక వాస్తవాలు కూడా వెలుగు చూశాయి. ధృవ ప్రాంతం అంటే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అని తెలుసు. కానీ ఈ వీడియోలో కొన్ని చోట్ల మంచు పూర్తిగా కరిగిపోయి.. పల్చగా ఉంది. అలానే ధృవాల్లోని చాలా భాగంలో పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. గ్లోబల్ వార్మింగ్ వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే.. అతి త్వరలోనే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పెరిగిన కొద్ది.. ధృవాల్లో మంచు కరిగే శాతం పెరుగుతుంది. ఫలితంగా నదులు, సముద్రాల్లో నీటి మట్టం పెరిగి దేశాలకు దేశాలే జలమయం అవుతాయని.. నీటిలో మునిగిపోతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భూమి మీద మూడు వంతుల నేల, ఒక భాగం నీరు ఉంది. కానీ గ్లోబల్ వార్మింగ్ పెరిగితే భూభాగం క్రమంగా తగ్గిపోతుందని.. అప్పుడు భూమే ఓ పెద్ద చెరువుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇది కూడా చదవండి:

ఉద్యోగుల కొంప ముంచిన ఏఐ.. ఆ కంపెనీలో వందల జాబ్స్ హుష్ కాకి

సిగరెట్‌ లేదన్నాడని.. ఎంతపని చేశాడో తెలిస్తే..

Updated Date - Apr 03 , 2025 | 10:38 AM