USA-Canada: కెనడా అమెరికాలో విలీనమైతే జరిగేది ఇదే..
ABN , Publish Date - Jan 10 , 2025 | 05:12 PM
కెనడా అమెరికాలో విలీనమైతే పలు ఆసక్తికర మార్పులు వస్తాయని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే సంచలనాలకు తెరతీయడం ప్రారంభించారు. కెనడా అమెరికాలో విలీనమైతేనే మెరుగంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చివరకు కెనడా ప్రధాని ట్రూడో రాజీనామాకు దారి తీశాయి. కెనడా అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనమైతే ఏం జరుగుతుందో రాజకీయ నిపుణులు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు (Canada - USA).
కెనడా విలీనం తరువాత అమెరికా రష్యాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అవతరిస్తుంది. ఉత్తర అమెరికా ఖండంలోని 80 శాతం భూభాగం, భూమ్మీద 13 శాతం ప్రాంతం అమెరికా పరిధిలోకి వస్తుంది.
కెనడా జీడీపీ 2 ట్రిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది. కాబట్టి విలీనం తరువాత కెనడా అమెరికాలో మూడో అత్యంత సంపన్నమైన రాష్ట్రంగా నిలుస్తుంది. ప్రస్తుతం కాలిఫోర్నియా, టెక్సాస్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. విలీనం తరువాత అమెరికా ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం 17.79 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థకు దాదాపు రెండింతలు పెద్దదవుతుంది.
Russia: సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రష్యాలో మరో కొత్త పథకం! విద్యార్థినులకు మాత్రమే!
కెనడా విలీనం తరువాత ఉత్తర ధృవంపై అమెరికా పట్టు మరింత బిగుసుకుంటుంది. కెనడాకు చెందిన లక్ష మంది సైన్యం ద్వారా అమెరికా ఆర్కిటిక్ ప్రాంతంలోని నార్త్‌వెస్ట్ ప్యాసెజ్‌పై ఆధిపత్యం సాధిస్తుంది.
విలీనం తరువాత కెనడా అపార సహజ వనరులు అమెరికా సొంతమవుతాయి. కెనడాలోని మంచినీటి నిల్వలు, ప్రపంచంలో 13 శాతంగా ఉన్న చమురు నిల్వలు అమెరికా పరమవుతాయి. ఫలితంగా అమెరికా చమురు నిల్వలు 215 బిలియన్ బారెల్స్‌కు చేరుకుంటాయి. రష్యా (100 బిలియన్ బారెల్స్), ఇరాక్ (145 బిలియన్ బారెల్స్), ఇరాన్ (208 బిలియన్ బారెల్స్) మించిపోవడమే కాకుండా సౌదీ అరేబియాకు (267 బిలియన్ బారెల్స్) దీటుగా నిలుస్తాయి.
Trump : 'గల్ఫ్ ఆఫ్ అమెరికా' వ్యాఖ్యలపై.. ట్రంప్‌కు మెక్సికన్ అధ్యక్షురాలి కౌంటర్..
కెనడా జనాభా మొత్తం అమెరికా పరం కావడంతో అమెరికా జనాభా సంఖ్య 380 మిలియన్లకు చేరుకుంటుంది.
అయితే, అమెరికాలో కెనడా విలీనం దాదాపు అసాధ్యమన్నది కొందరు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెప్పే మాట. ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ, సాంస్కృతిక, సామాజిక అంతరాలను అధిగమించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదట. ఇది చాలదన్నట్టు కొన్నేళ్లుగా అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, ఒడంబడికలు కూడా పరిస్థితిని సంక్లిష్టంగా మారుస్తాయి.
Donald Trump : ట్రంప్ విస్తరణ కాంక్ష!
Read Latest and International News