Share News

Chanakya Niti: మీకు ఈ లక్షణాలు ఉంటే.. జన్మలో ధనవంతులు కాలేరు..

ABN , Publish Date - Apr 02 , 2025 | 06:33 PM

Chanakya Niti In Telugu: కొన్ని వందల ఏళ్ల క్రితం ఆచార్య చాణక్యుడు చెప్పిన గొప్ప గొప్ప విషయాలు ఇప్పటికీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే గనుక మనిషులు విజయ పథంలో పరిగెత్తవచ్చు. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆయన మాటలు.. వజ్రాల కంటే విలువైనవి అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Chanakya Niti: మీకు ఈ లక్షణాలు ఉంటే.. జన్మలో ధనవంతులు కాలేరు..
Chanakya Niti

పేదరికంలో బతకాలని ఎవ్వరికి మాత్రం ఉంటుంది చెప్పండి. అవకాశం వస్తే కోట్లు సంపాదించి.. నేనే తోపు అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. ప్రపంచం ఈ మూలనుంచి ఆ మూల వరకు ఉండే 99.99 శాతం మందికి ధనవంతులు కావాలనే ఉంటుంది. కానీ, కేవలం కొంతమంది మాత్రమే కోట్లు సంపాదించి, విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా పేదరికంలోనే మిగిలిపోతున్నారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం ఈ లక్షణాలు ఉన్న వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరట. జీవితాంతం పేదలుగానే మిగిలిపోతారట. మనల్ని పేదలుగానే ఉంచే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


డబ్బులు దాచుకోవటం..

డబ్బుల్ని ఎప్పటికీ దాచుకోకూడదని చాణక్యుడు అన్నాడు. దాచుకునే బదులు దాన్ని దేనిలోనైనా పెట్టుబడిగా పెట్టమన్నాడు. దాచుకున్న డబ్బుకు విలువ ఉండదు. అదే దాన్ని పెట్టబుడిగా పెడితే .. డబ్బు, డబ్బును సంపాదించే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టమన్నాడు కదా అని.. దేనిలో పడితే దానిలో పెట్టకూడదు. సరైన వాటిలో పెట్టుబడి పెట్టాలి.

అక్రమ సంపాదన

ఎలాగైనా డబ్బులు సంపాదించాలన్న కసితో కొంతమంది తప్పుడు మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాంటి వారు మొదట్లో కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదించవచ్చు.. కానీ, చేసేది తప్పుడు పని కాబట్టి.. ఎప్పటికైనా నష్టపోతారు. అక్రమ మార్గంలో సంపాదించే డబ్బు ఎక్కువ రోజులు నిలవదని చాణక్యుడు అన్నాడు.


దాన కర్ణుడు

దానం చేయడం మంచి గుణమే కానీ.. అతిగా దానం చేయడం మాత్రం కచ్చితంగా మంచిది కాదు. అది మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది. కాబట్టి.. దానం చేయాలనుకుంటే మనకు వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని దానం చేయాలి. మనకు వచ్చే దానికంటే ఎక్కువ చేస్తే మాత్రం.. మనకు వేరేవాళ్లు దానం చేయాల్సి వస్తుంది.

బద్దకం

మన చేతిలో ఎంత డబ్బులు ఉన్నాసరే.. బద్దకంగా మాత్రం ఉండకూడదు. పని, పాటా లేకుండా చేతిలో ఉన్న డబ్బుల్ని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే పేదరికం చుట్టుముడుతుంది. బద్ధకాన్ని వదిలి డబ్బులు సంపాదించే మార్గాలను వెతుక్కోవాలి.


ఖర్చులు

నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అన్న దానికంటే.. సంపాదించిన దాంట్లో ఎంత ఖర్చు చేస్తున్నావు అన్నదే ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా.. ఇష్టం వచ్చినవన్నీ కొనుక్కుంటూ వెళితే.. చివరికి చిప్పే గతి అవుతుంది.

గర్వ పడకూడదు..

కొంతమంది కొంచెం డబ్బులు సంపాదించగానే.. మాకంటే తోలుపు లేరు అన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఈగో బాగా పెరిగిపోతుంది. ఆ ఈగో కారణంగా బుర్ర సరిగా పని చేయటం మానేస్తుంది. గర్వం కారణంగా ఉన్నది పోయే అవకాశాలే ఎక్కువ.


ఇవి కూడా చదవండి:

Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ సంచలన నిర్ణయం..

Waqf Bill 2024: మరోసారి దేశవిభజన కానీయం: అనురాగ్ ఠాకూర్

Updated Date - Apr 02 , 2025 | 06:55 PM