West Bengal Violence: బెంగాల్ అలర్ల వెనుక బంగ్లాదేశ్ దుండగులు
ABN , Publish Date - Apr 16 , 2025 | 07:42 AM
పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల వెనుక బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మమతా బెనర్జీ సర్కారు చొరబాటుదార్లను అడ్డుకోవడంలో విఫలమైంది

మమత సర్కారు విఫలం.. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
కోల్‌కతా, ఏప్రిల్ 15: వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడం వెనుక బంగ్లాదేశ్ దుండగుల ప్రమేయం ఉన్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికీ వెళ్లినట్టు తెలిపాయి. బంగ్లాదేశ్‌కు పొరుగున ఉన్న ముర్షీదాబాద్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోకి చొరబాటుదార్లు రాకుండా అడ్డుకోవడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమయినట్టు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది.