ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Elections: మేము విపక్షమైతే బీజేపీ మీ దోస్తా?.. గెహ్లాట్‌ను నిలదీసిన కేజ్రీ

ABN, Publish Date - Jan 08 , 2025 | 04:37 PM

ఢిల్లీలో 'ఆప్' తమకు విపక్షమని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బుధవారంనాడు జరిగిన ఒక కార్యకర్మంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించడంపై ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురకలు వేశారు.

న్యూఢిల్లీ: 'ఇండియా' కూటమిలో మిత్రపక్షంగా ఉంటూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా విడివిడిగా పోటీ చేస్తున్న ఆప్ (AAP), కాంగ్రెస్ (Congress) మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఢిల్లీలో 'ఆప్' తమకు విపక్షమని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బుధవారంనాడు జరిగిన ఒక కార్యకర్మంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) వ్యాఖ్యానించడంపై ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చురకలు వేశారు. 'ఆప్'కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కలిసికట్టుగా పనిచేస్తున్నట్టు ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

Delhi Elections 2025: రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. కాంగ్రెస్ మరో స్కీమ్


''గెహ్లాట్ జీ... ఢిల్లీలో కాంగ్రెస్‌కు ప్రత్యర్థి 'ఆప్' అంటూ మీరు చెప్పారు. బీజేపీ ఊసెత్తలేదు. దీంతో ప్రజలుకూడా కాంగ్రెస్‌కు ఆప్ ప్రత్యర్థి అని, బీజేపీకి భాగస్వా్మి అని అనుకుంటున్నారు. ఆప్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పటికీ వరకూ మీ రెండు పార్టీల మధ్య సహకారం రహస్యంగా ఉంది. ఈరోజు మీరు ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. మీ వివరణకు ఢిల్లీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను'' అని కేజ్రీవాల్ 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు.


గెహ్లాట్ ఏమన్నారు?

గెహ్లాట్ బుధవారం ఉదయం మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు ఆప్ ప్రత్యర్థి అని, ఢిల్లీలో ఇప్పుడు పరిస్థితి మారిందని చెప్పారు. కాంగ్రెస్ ఈసారి మెరుగైన ప్రచారం చేయనుందని, ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెరుగయ్యాయని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం దేశానికి కూడా అవసరమని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని, ఈ హామీని పార్టీ మేనిఫెస్టోలో చేరుస్తామని తెలిపింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి..

Supreme Court: సమాచార కమిషన్‌ పదవులను తక్షణమే భర్తీ చేయండి

ఎక్కడ దాక్కున్నా పట్టిచ్చే ‘భారత్‌ పోల్‌’

Read Latest National News and Telugu News

Updated Date - Jan 08 , 2025 | 04:37 PM