Delhi Polls: అతిషిని అడవిలో జింకతో పోల్చిన బిధూడీ
ABN , Publish Date - Jan 15 , 2025 | 05:59 PM
అతిషిపై బిధూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. అతిషి ఇంటిపేరు మార్చుకున్నారంటూ జనవరి 6న రోహిణిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
న్యూఢిల్లీ: బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ బిధూడీ (Ramesh Bidhuri) మరోసారి నోరుజారారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి (Atishi)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అడవిలో పరిగెడుతున్న జింకతో ఆమెను పోల్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజవకర్గం నుంచి పోటీ చేస్తు్న్న అతిషిపై ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
Prashant Kishore: నిరాహార దీక్ష విరమించనున్న పీకే.. కీలక ప్రకటనకు సిద్ధం
"ఢిల్లీ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీధుల పరిస్థితి ఒకసారి చూడండి. గత నాలుగేళ్లలో ప్రజలను కలుకునేందుకు ఎన్నడూ రాని అతిషి ఇప్పుడు ఎన్నికలు రావడంతో అడవిలో జింకలా ఢిల్లీ వీధుల్లో పరిగెడుతున్నారు'' అని బిధూడీ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.
అతిషిపై బిధూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. అతిషి ఇంటిపేరు మార్చుకున్నారంటూ జనవరి 6న రోహిణిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. మర్లినా తండ్రిని మార్చుకున్నారని, గతంలో ఆమె మర్లెనా అని, ఇప్పుడు సింగ్ అయ్యారని బిధూడీ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను అతిషి ఖండించడంతో పాటు మీడియా సమావేశంలో కంటతడి పెట్టారు. ఈదేశ రాజకీయాలు ఇంతలా దిగజారిపోతాయని తాను అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిధూడీ వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలకు దిగకుండా సంయమనం పాటించాలని నేతలకు హితవు చెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీ సీఎం అభ్యర్థిగా బిధూడిని ప్రకటించనున్నారంటూ ఇటీవల కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం, అదేమీ లేదని, తాను సీఎం రేసులో లేనని బిధూడీ తిప్పికొట్టడం జరిగింది.
ఇవి కూడా చదవండి..
Maha Kumbh: కుంభమేళాకు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..
Kejrival : ఢిల్లీ ఎన్నికల సమయంలో..కేజ్రీవాల్‌కు ఈడీ షాక్..
Read Latest National News and Telugu News