Share News

Chennai: అది మార్ఫింగ్‌ ఫొటోనే.. ప్రభాకరన్‌తో సీమాన్‌ ఫొటోపై డైరెక్టర్‌ శంగగిరి వివరణ

ABN , Publish Date - Jan 21 , 2025 | 12:02 PM

నామ్‌ తమిళర్‌ కట్చి నేత, సినీ దర్శకుడు సీమాన్‌(Seeman) ఎల్టీటీఈ నేత వేలుపిల్లై ప్రభాకరన్‌(Velupillai Prabhakaran)తో ఉన్న పాత ఫొటో మార్ఫింగ్‌దని ‘వెంగాయం’ సినీ దర్శకుడు శంగగిరి రాజ్‌కుమార్‌ ఆరోపించారు.

Chennai: అది మార్ఫింగ్‌ ఫొటోనే.. ప్రభాకరన్‌తో సీమాన్‌ ఫొటోపై డైరెక్టర్‌ శంగగిరి వివరణ

- నామ్‌ తమిళర్‌ కట్చి ఖండన

చెన్నై: నామ్‌ తమిళర్‌ కట్చి నేత, సినీ దర్శకుడు సీమాన్‌(Seeman) ఎల్టీటీఈ నేత వేలుపిల్లై ప్రభాకరన్‌(Velupillai Prabhakaran)తో ఉన్న పాత ఫొటో మార్ఫింగ్‌దని ‘వెంగాయం’ సినీ దర్శకుడు శంగగిరి రాజ్‌కుమార్‌ ఆరోపించారు. ప్రభాకరన్‌తో సీమాన్‌ ఉన్న ఫొటో ఎడిట్‌ చేసింది తానేననంటూ బాంబు పేల్చారు. ఈ మేరకు శంగరిరి రాజ్‌కుమార్‌ తన ఎక్స్‌పేజీలో ఓ ప్రకటన విడుదల చేశారు. వాస్తవంగా ‘ఈయన (సీమాన్‌) ఆయనను (ప్రభాకరన్‌ను) కలుసుకోలేదని, ఇలా ఎందుకు చెబుతున్నానంటే ఈ ఫొటో ఎడిట్‌ చేసి ఇచ్చింది తానేనని పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Five-step security: సమీపిస్తున్న రిపబ్లిక్‌ డే.. అడుగడుగునా తనిఖీలు


nani2.2.jpg

ఆ ఫొటో గురించి మీడియాతో ఆయన ప్రస్తావిస్తూ తొలినాళ్లలో తాను ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌(Private TV channel)లో పనిచేస్తుండేవాడినని, ఆ ఛానెల్‌లోనే సీమాన్‌ స్నేహితుడు కూడా పనిచేస్తుండేవాడని, ఓ రోజు ఆయన ప్రభాకరన్‌తో దర్శకుడు మహేంద్రన్‌ తదితరులు కలిసి తీసుకున్న ఫొటోలు ఉన్న డీవీడీ, సీమాన్‌ ఫొటో ఇచ్చారని తెలిపారు. డీవీడీలోని ప్రభాకరన్‌ ఫొటోలను ఉపయోగించిన ఆయన పక్కనే సీమాన్‌ నిలిచిఉన్నట్లు ఓ ఫొటోను తయారు చేసి ఎడిట్‌ చేసి ఇవ్వమని చెప్పారని, ఆ ప్రకారమే తాను ఫొటో చేసి ఇచ్చానని శంగగిరి రాజ్‌కుమార్‌ తెలిపారు.


ఆ ఫొటోని గమనిస్తే సీమాన్‌ వెనుక నీడ ఉంటుందని, అయితే ప్రభాకరన్‌ వెనుక నీడ ఉంచేందుకు మరచిపోయానని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత ఆ ఫొటోను ఏం చేశారని సీమాన్‌ స్నేహితుడిని అడిగినప్పుడు ఆ ఫొటో వల్లే రాష్ట్రంలో కొత్త రాజకీయ నాయకుడు (సీమాన్‌) పుట్టుకొచ్చాడని తనకు చెప్పాడన్నారు. శంగగిరి రాజ్‌కుమార్‌ చేసిన ఈ ఆరోపణలను నామ్‌ తమిళర్‌ కట్చి తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ ప్రముఖడు సాట్టై దురైమురుగన్‌ తన ఎక్స్‌ పేజీలో ఓ ప్రకటన చేస్తూ ఆ ఫొటోను నకిలీదని చెబుతున్న శంగగిరి రాజ్‌కుమార్‌కు తమ వద్ద సీమాన్‌ ప్రభాకరన్‌తో తీసుకున్న ఆరేడు ఫొటోలున్న సంగతిని మరచిపోయినట్లుందని, ఇకనైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ హితవుపలికారు.


ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2025 | 12:02 PM