Share News

Delhi Elections: ఆప్‌ ఓటమికి 5 కారణాలు...

ABN , Publish Date - Feb 09 , 2025 | 05:17 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను ఏమీ చేయనీయడం లేదం టూ సుదీర్ఘకాలం పాటు ఆప్‌ అధినేత, అప్పటి సీఎం కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌, పోలీసులు తనకు సహకరించడం లేదన్నారు. రహదారులను బాగుచేయడం, నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ఢిల్లీ కార్పొరేషన్‌లో తనకు బలం లేనందున సాగడం లేదన్నారు. దీంతో 2022లో ప్రజలు కార్పొరేషన్‌ పగ్గాలను కూడా ఆప్‌కే అప్పగించారు.

Delhi Elections: ఆప్‌ ఓటమికి  5 కారణాలు...
AAP Defeted in Delhi

కేంద్రంపై నెపాలు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను ఏమీ చేయనీయడం లేదం టూ సుదీర్ఘకాలం పాటు ఆప్‌ అధినేత, అప్పటి సీఎం కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌, పోలీసులు తనకు సహకరించడం లేదన్నారు. రహదారులను బాగుచేయడం, నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు ఢిల్లీ కార్పొరేషన్‌లో తనకు బలం లేనందున సాగడం లేదన్నారు. దీంతో 2022లో ప్రజలు కార్పొరేషన్‌ పగ్గాలను కూడా ఆప్‌కే అప్పగించారు. అయినా అభివృద్ధి సాగలేదు. చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణలోనూ వెనుకబడిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఈ వాతావరణం సామాన్యులకు విసుగు తెప్పించింది. ఢిల్లీ పీఠంపై ఉన్న బీజేపీ దేశాన్ని ఏలుతోంది. అలాంటిది.. ఢిల్లీ రాష్ట్రాన్ని మాత్రం మరొకరికి అప్పగించడం ఎందుకనే ఆలోచన మొదలైంది. తాజా ఎన్నికల్లో ఆప్‌ ఓటమికి ఇదో ప్రధాన కారణంగా నిలిచింది.

కనిపించని అభివృద్ధి..

అధికారంలోకి వస్తే.. ఎన్నెన్నో చేస్తామని హామీలు గుప్పించిన ఆప్‌.. తీరా పగ్గాలు చేపట్టాక.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేక పోయింది. స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్‌, ప్రజారోగ్యం, రవాణా సౌకర్యాలు వంటివాటి లో చాలా వెనుకబడింది. దీనికితోడు యమునా నది కాలుష్యా న్ని కరిగిస్తామన్న హామీ మాటలకే పరిమితమైంది. అభివృద్ధి నత్తనడకన సాగింది. కొన్ని ప్రాంతాల్లో ఫుట్‌ పాత్‌లు నిర్మించినా.. ప్రయోజనం దక్కలేదు. మొహల్లా క్లినిక్‌లు మంచి పేరు తెచ్చినా.. తర్వాత నామ మాత్రం గా మారాయి. దీంతో ప్రజలు విసిగెత్తిపోయారు.

అవినీతి ఆరోపణలు..

ఆప్‌ రెండో విడత పాలనలో అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. కీలక నేతలు కేసుల్లో చిక్కుకున్నారు. సాక్షాత్తూ కేజ్రీవాల్‌, సహా పలువురు జైలుకు వెళ్లడం.. ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణం పార్టీకి ప్రాణసంకటంగా మారింది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని ఆప్‌ నేతలు చెప్పినా.. ప్రజలు పట్టించుకోలేదు. దీనికి తోడు పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు.. ఆప్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతోపాటు కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు సంధించారు. ఇది కూడా ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసింది.


హామీలపై పేటెంట్‌ ఔట్‌!

ప్రజలకు ఉచితాలు ఇవ్వడంలో పేటెంట్‌ తమదేనని భావించిన ఆప్‌కు ఈ దఫా బీజేపీ భారీ దెబ్బ కొట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉచిత హామీలు.. తమకు గెలుపును అందిస్తాయని ఆప్‌ నేతలు అంచనా వేసుకున్నారు. అయితే.. ఇదే బాటలో ఇంతకన్నా వేగంగా దూసుకువచ్చిన బీజేపీ ప్రజలపై వరాల జల్లు కురిపించి.. ఆప్‌ హామీలను ఓవర్‌ టేక్‌ చేసింది. ఆప్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పడంతోపాటు.. అనేక ఇతర హామీలను కూడా కురిపించింది.

కేంద్ర బడ్జెట్‌లో వరాలు..

ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ ఢిల్లీ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది. రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను పరిమితి మధ్యతరగతి జీవులను ఆకర్షించింది. 8వ వేతన సంఘం కూడా ఆకట్టుకుంది. అదేవిధంగా కేజ్రీవాల్‌ ‘మోనార్క్‌’ తరహా రాజకీయాలు, నిర్ణయాలు ప్రజలకు నచ్చలేదు. విడతల వారీగా సుదీర్ఘకాలం కొనసాగిన రైతుల ఆందోళనతో ఢిల్లీ ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారు. ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ‘ఆప్‌’పై కోపం పెంచుకున్నారు. వెరసి.. కర్ణుడి చావుకు.. అన్నట్టుగా ఆప్‌ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి...

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 09 , 2025 | 09:58 AM