BJP vs AAP: ఢిల్లీ ఫలితాల్లో బిగ్ ట్విస్ట్.. ఒక్కసారిగా మారిన లెక్కలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:16 AM
Delhi Assembly Election 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని ట్విస్ట్ ఏర్పడింది. ఒక్కసారిగా లెక్కలు మారిపోయాయి. అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆరంభం నుంచి భారతీయ జనతా పార్టీ దూకుడు చూపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి షురూ అయిన బీజేపీ హవా.. ఇంకా కంటిన్యూ అవుతోంది. 50 స్థానాలు గెలుచుకునే దిశగా కమలం పార్టీ పరుగులు పెట్టింది. దీంతో బీజేపీదే అధికారం అని అంతా డిసైడ్ అయ్యారు. కానీ ఒక్కసారిగా ఫలితాల్లో లెక్కలు మారాయి. బీజేపీతో సై అంటే సై అంటూ ఫైట్ చేస్తోంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. కీలకమైన 15 స్థానాల్లో ఇరు పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది.
రౌండ్ రౌండ్‌కు ఉత్కంఠ!
15 స్థానాల్లో బీజేపీ-ఆప్ మధ్య ఉన్న తేడా 3,000 ఓట్లు మాత్రమే. కేవలం వందల తేడాతోనే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 7 చోట్ల రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యాలతో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో ఇంకా సగం ఓట్ల లెక్కింపు కూడా పూర్తి కాలేదు. ఒకవేళ ఆప్ దూకుడుగా ఆధిక్యాన్నిపెంచుకుంటూ పోతే లెక్కలు మరింత వేగంగా మారే అవకాశం ఉంటుంది. అదే జరిగితే బీజేపీ మెజారిటీ ఫిగర్‌కు చేరుకోవడం కొంత కష్టమవ్వొచ్చు. మరి.. ఫలితాల్లో ఇంకా ఏమైనా అనూహ్య సంచలనాలు ఉంటాయా? అనేది చూడాలి.
ఇదీ చదవండి:
కాంగ్రెస్ వైట్‌వాష్.. ఇది ఊహించలేదు
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో మారుతున్న లెక్కలు..
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. కేజ్రీవాల్‌కు ఊహించని షాక్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి