Share News

Income Tax: సామాన్యులకు ఐటీ డిపార్ట్‌మెంట్ దిమ్మతిరిగే షాకులు

ABN , Publish Date - Mar 29 , 2025 | 04:00 PM

ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తున్న నోటీసుల దెబ్బకి కొందరు సామాన్యులకి దిక్కులు తెలియడం లేదు. ఉబ్బితబ్బిబ్బై ఊరేగాలో.. వూరికే ఇంట్లో ఉండి రోధించాలో అర్థం కావడం లేదు.

Income Tax: సామాన్యులకు ఐటీ డిపార్ట్‌మెంట్ దిమ్మతిరిగే షాకులు
IT Notices

ఇద్దరు నిరుపేదలకు ఐటీ శాఖ ఇచ్చిన షాకులకు ఒక్కసారిగా రెండు ఫ్యామలీలకు దిమ్మ తిరిగిపోయింది. రెక్కాడితేకాని, డొక్కాడని జీవితాలు నడుపుతున్న ఇద్దరు రూ. కోట్లలో ఇన్ కం ట్యాక్సులు కట్టాలని నోటీసులు రావడంతో ఏం చేయాలో పాలు పోక లబోదిబోమంటూ ఆయా ఐటీ ఆఫీసుల మెట్లెక్కారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూశాయి ఈ రెండు ఘటనలు.


ఇంతకీ వీరిద్దరి వర్తకాలు ఏంటంటే, ఒక వ్యక్తి గుడ్లు అమ్ముకునే వ్యక్తి. మరొకరు జ్యూస్‌ల విక్రేత. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో, గుడ్లు అమ్ముకుంటాడు సుమన్. తనకు అస్సలు సంబంధం లేని దాదాపు రూ.50 కోట్ల వ్యాపారానికి సంబంధించి నోటీసు జారీ చేశారని వాపోయాడు. తాను ప్రభుత్వానికి రూ.6 కోట్ల మేర వస్తువులు, సేవల పన్ను (GST) గా బాకీ ఉన్నానని ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులో ఉన్నట్టు పేర్కొన్నారు. 2022లో ఢిల్లీలోని స్టేట్ జోన్ 3, వార్డ్ 33లో "ప్రిన్స్ ఎంటర్‌ప్రైజెస్" అనే కంపెనీ సుమన్ పేరు మీద రిజిస్టర్ చేయబడిందని ఐటీ శాఖ నోటీసులో వెల్లడైంది. ఈ సంస్థ తోలు, కలప, ఇనుము వ్యాపారం చేస్తున్నట్టుగా చూపించారు. గత రెండు సంవత్సరాలలో భారీ లావాదేవీలు నిర్వహించిందని ఆరోపణలు చేశారు.


"నేను బండిపై మాత్రమే గుడ్లు అమ్ముతాను. నేను ఎప్పుడూ ఢిల్లీకి వెళ్ళలేదు, అక్కడ కంపెనీని ప్రారంభించడం గురించి చెప్పనవసరం లేదు" అని పథారియా నగర్‌లో నివసించే సుమన్ అంటున్నాడు. సుమన్ తండ్రి ఏమంటున్నాడంటే, "మా దగ్గర నిజంగా ₹50 కోట్లు ఉంటే, రోజువారీ ఖర్చుల కోసం తామెందుకు కష్టపడతాం?" అని ప్రశ్నిస్తున్నాడు. అయితే, ఈ తప్పిదానికి సుమన్ వ్యక్తిగత పత్రాలు దుర్వినియోగం కావడమేనని సుమన్ న్యాయవాది అనుమానిస్తున్నారు. "ఎవరో మోసం ద్వారా సుమన్ పత్రాలను ఉపయోగించారు. కేసు దర్యాప్తు కోసం మేము పోలీసులు,పన్ను అధికారులను సంప్రదించాం" అని ఆయన అన్నారు.


ఇక, సుమన్ ఒక్కడే కాదు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన జ్యూస్ విక్రేత ఎండీ రహీస్‌కు రూ. 7.5 కోట్లకు పైగా ఐటీ నోటీసు అందింది. "ఈ నోటీసు ఎందుకు జారీ చేయబడిందో నాకు తెలియదు. నేను జ్యూస్ మాత్రమే అమ్ముతాను. నేను ఇంత డబ్బు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నేను ఏమి చేయాలి?" అని రహీస్ వాపోతున్నాడు. 2020-21లో రహీస్ పేరుతో కోట్ల విలువైన "నకిలీ" లావాదేవీలను నోటీసులో ఎత్తి చూపారు. అందువలన, అతను ప్రభుత్వానికి రూ. 7,79,02,457 మేర జీఎస్టీ చెల్లించాల్సి ఉందని నోటీసులో ఇచ్చారు.


"మేము ఐటీ అధికారులను సంప్రదించాం, వారు నా వ్యక్తిగత పత్రాలను ఎవరికైనా ఇచ్చారా అని అడిగారు. లేదని చెప్పాను" అని బన్నా దేవి పోలీస్ స్టేషన్ పరిధిలోని తార్ వాలి గలిలో నివసిస్తున్న రహీస్ అన్నారు. రహీస్ తల్లి ఏమంటున్నారంటే "మేము మా రోజువారీ భోజనం కోసం ఇబ్బంది పడుతున్నాము... మా దగ్గర అంత డబ్బు ఉంటే, మా కొడుకు ఎందుకు అంత కష్టపడాల్సి వస్తుంది?" అని ప్రశ్నిస్తోంది. కాగా, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కోట్ల రూపాయల విరాళం ఇవ్వడానికి రహీస్ వ్యక్తిగత పత్రాలను మోసపూరితంగా ఉపయోగించారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సంబంధిత వర్గాలు చెబుతుండటం విశేషం.


ఇవి కూడా చదవండి

Attack On Maoists: భద్రతా దళాలకు ఎదురుపడిన మావోయిస్టులు.. చివరకు..

టీడీపీ ఆవిర్భావ దినోత్సవం.. జెండా ఆవిష్కరించిన సీఎం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 29 , 2025 | 04:17 PM