Share News

Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..

ABN , Publish Date - Apr 01 , 2025 | 06:49 PM

Husband Marries Wife to Lover: మీరట్‌లో ప్రియుడితో కలిసి కట్టుకొన్న భర్తను ముక్కలుగా నరికి చంపింది. ప్రియుడిపై మోజు కారణంగా.. భర్తకు విషం ఇచ్చి హత్య చేసింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న వరుస ఈ ఘటనలతో అదే రాష్ట్రానికి చెందిన బబ్లూ కలవరపాటుకు గురయ్యాడు. దీంతో తన భార్య రాధిక.. ప్రియుడు వికాస్‌తో అక్రమ సంబంధం ఉన్నట్లు గుర్తించాడు. దాంతో పెద్దల సమక్షంలో వివాహం జరిపించాడు. అయితే ఈ పెళ్లి అయిన నాలుగు రోజులకే రాధికతోపాటు ఆమె ప్రియుడు వికాస్.. బబ్లూకు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..

అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్య రాధికను.. ఆమె ప్రియుడి వికాస్‌తో పెద్దల సమక్షంలో వివాహం జరిపించడం ద్వారా మాంగ్యల్యానికి మరో ముడి వేయించి బబ్లూ ట్విస్ట్ ఇస్తే. ఆ ప్రియుడు వికాస్ మాత్రం.. తన ప్రియురాలి భర్త బబ్లూకు.. అది కూడా ఈ వివాహం జరిగిన జస్ట్ నాలుగు రోజులకే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. రాధికను భర్త బబ్లూ వద్ద విడిచి పెట్టాడు. అందుకు కారణాన్ని సైతం అతడు వివరించారు. వికాస్ ఏమన్నాడంటే.. రాధికను తిరిగి ఆమె మొదటి భర్తకు అప్పగించాలని తన తల్లి కోరిందని చెప్పారు. భార్య లేకపోవడం వల్ల బబ్లూ భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయని తన తల్లి వివరించిందని తెలిపారు. అంతేకాదు.. బబ్లూ, రాధికలకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ఈ ప్రభావం వారిపై చూపుతోందని తన తల్లి సోదాహరణగా తెలియజేసిందని వికాస్ వివరించాడు. దీంతో ఈ వ్యవహరంపై ఆ గ్రామ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాధిక, బబ్లూ, వికాస్ అంశంపై చర్చించారు. అనంతరం బబ్లూ, రాధిక కలిసి ఉండాలని వారంతా నిర్ణయించారు.


ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లో వరుస హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఆ హత్యలు సైతం అక్రమ సంబంధాల కారణంగా చోటు చేసుకుంటున్నాయి. అందుకు మీరట్‌లో మర్చంట్ నేవీ అధికారి భర్తను అతడి భార్య..తన ప్రియుడితో కలిసి ఎలా హత్య చేసిందో తెలిసి దేశం ఆశ్చర్య పోయింది. ఇంకో మహిళ అయితే.. ఇదే అక్రమ సంబంధం కారణంగా.. మొగుడికి విషం ఇచ్చి హత్య చేయించింది. ఈ తరహా వరుస ఘటనలతో ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ జిల్లా కటార్‌జాట్ గ్రామానికి చెందిన బబ్లూ కలవరపాటుకు గురయ్యాడు.

అయితే 2017లో బబ్లూకు గోరఖ్‌పూర్‌కు చెందిన రాధికతో వివాహం జరిగింది.వారికి ఇద్దరు సంతానం.వలస కార్మికుడైన బబ్లూ.. పని కోసం వేరే రాష్ట్రానికి వెళ్తుంటాడు. ఆ క్రమంలో ఆతడి భార్య రాధిక అదే గ్రామానికి చెందిన వికాస్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ విషయం బబ్లూకు తెలిసింది. దీంతో తన రాష్ట్రంలో ఇటీవల ప్రియడితో కలిసి భర్తలను చంపిన ఘటనలు బబ్లూ కళ్ల ముందు కదలాడాయి. దీంతో తన భార్య సైతం తనను అలాగే అంతం చేస్తుందిని భయపడ్డాడు.


వివాహేతర సంబంధం ఉందంటూ భార్యతో ఘర్షణకు దిగి.. తన ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎందుకని బబ్లూ భావించాడు.ప్రాణభయంతో భార్యకు ఆమె ప్రియుడిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ వివాహానికి వీరిద్దరి చేత అంగీకరింప చేశాడు. దీంతో గ్రామంలోని స్థానిక శివాలయం వద్ద పెద్దల సమక్షంలో తన భార్య రాధికకు మళ్లీ పెళ్లి చేశాడు.వారి వివాహాన్ని కోర్టులో సైతం బబ్లూ నోటిఫై చేశాడు. అదీకాక అఫిడవిట్‌లో తానే సాక్షిగా సంతకం చేయడం గమనార్హం. ఇక తన ఇద్దరి పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా చూసుకొంటానని ఈ సందర్భంగా రాధిక మాజీ భర్త బబ్లూ తీసుకొంటానని స్పష్టం చేసిన విషయం విధితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి

Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు

Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్

For Latest National News , National News in Telugu

Updated Date - Apr 01 , 2025 | 07:27 PM