Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:51 PM
Bengaluru Teacher: విద్యార్థి తండ్రిని ఓ పథకం ప్రకారం ముగ్గులోకి దింపింది ఓ టీచర్. అనంతరం భారీగా నగదు డిమాండ్ చేసింది. ఆ క్రమంలో కొంత నగదు ఇస్తానంటూ ఒప్పందం కుదిరింది. కానీ బెదిరింపులు, బ్లాక్ మెయిల్ మాత్రం ఆగలేదు. దీంతో సదరు బాధితుడిగా మారిన వ్యక్తి.. తన ఫ్యామిలీని మరో రాష్ట్రానికి తీసుకు వెళ్లాడు. దీంతో తన కుమార్తె స్టడీ సర్టిఫికేట్ కోసం స్కుల్‌కు వెళ్లాడు.

బెంగళూరు, ఏప్రిల్ 01: విద్యార్థి తండ్రిని ఓ పథకం ప్రకారం ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ముగ్గులోకి దింపింది. ఆ తర్వాత అతడిని బెదిరించి.. భారీగా నగదు డిమాండ్ చేసింది. దీంతో వారి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అయినా బెదిరింపులు, బ్లాక్ మెయిల్ మాత్రం ఆగలేదు. దీంతో బాధితుడిగా మారిన వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దాంతో ఆ ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్‌తోపాటు ఆమెకు సహాకరించిన ఇద్దరు వ్యక్తులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా వారికి.. 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిందీ కోర్టు. ఈ ఘటన ఇటీవల బెంగళూరులో చోటు చేసుకుంది.
క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగళూరు శివారు ప్రాంతంలో సతీష్ అనే వ్యాపారి నివసిస్తున్నారు. అతడికి భార్య.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2023లో అతడు తన చిన్న కుమార్తెను స్థానిక స్కూల్‌లో చేర్పించాడు. ఈ సందర్భంగా ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరు ఒకరికొకరు.. తరచూ ఫోన్ చేసుకోవడమే కాదు.. వీడియో కాల్స్ సైతం చేసుకునే వారు. ఆ క్రమంలో వీరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ బంధం చాాల రోజులు కొనసాగింది.
అలాంటి వేళ.. సతీష్ నుంచి తొలుత రూ. 4 లక్షల నగదు బలవంతంగా శ్రీదేవి వసూల్ చేసింది. అనంతరం రూ. 15 లక్షలు కావాలని అతడిని డిమాండ్ చేసింది. అయితే తన వద్ద అంత నగదు లేదని ఆమెకు సతీష్ తన పరిస్థితిని వివరించాడు. దీంతో రూ. 50 వేల నగదు అప్పు కావాలనే నెపంతో అతడి ఇంటికి శ్రీదేవి వెళ్లి.. బెదిరింపులకు దిగేది.
మరోవైపు సతీష్‌కు తన వ్యాపారంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో అతడు తన ఫ్యామిలీని గుజరాత్‌కు తరలించాడు. అయితే తన కుమార్తెకు స్టడీ సర్టిఫికేట్ కావాలంటూ సతీష్ స్కూల్‌కు వెళ్లాడు. ఆమె గదిలో శ్రీదేవితోపాటు సాగర్, కాలా అనే వ్యక్తులు ఉన్నట్లు గుర్తించాడు. వారు సైతం సతీష్‌ను బెదిరించారు. నగదు ఇవ్వకుంటే.. వీడియోలు, ఫొటోలను మీ కుటుంబానికి పంపుతామంటూ వారు బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా.. ఈ నగదులో రూ. 5 లక్షలు పోలీస్ అధికారికి, అలాగే సాగర్, కాలాలకు చెరో రూ. లక్ష ఇవ్వాలని సతీష్‌కు శ్రీదేవి వివరించింది. దీంతో వారికి రూ.15 లక్షలు ఇచ్చేందుకు సతీష్ తొలుత ఒప్పుకున్నాడు. అందులోభాగంగా తొలుత రూ. 1. 9 లక్షల నగదును వారికి అతడు చెల్లించాడు. అయినా వారి నుంచి బ్లాక్ మెయిలింగ్ రావడం ఆగలేదు. ఈ నేపథ్యంలో చివరకు విసుగు చెందిన సతీష్.. పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని.. విచారించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అందులో పోలీస్ అధికారికి రూ. 5 లక్షలు చెల్లించడం అనేది వాస్తవ విరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం వారిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వారిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి
Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు