Share News

AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ

ABN , Publish Date - Feb 07 , 2025 | 02:15 PM

Delhi ACB: ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వ్యాఖ్యలపై ఢిల్లీ ఏసీబీ జెట్ స్పీడ్‌లో రియాక్ట్ అయింది. ఆప్ నేషనల్ కన్వీనర్‌ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇతర నేతల ఇళ్లకు ఏసీబీ అధికారులు వెళ్తున్నారు. అసలు హస్తినలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..

AAP: ఆప్ నేతల వ్యాఖ్యలపై జెట్‌స్పీడ్ రియాక్షన్.. కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ
Aam Aadmi Party

ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.15 కోట్ల చొప్పున ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఏడుగుర్ని సంప్రదించారని చెప్పారు. ఈ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జెట్ స్పీడ్‌లో రియాక్ట్ అయ్యారు. ఆప్ ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఆదేశించారు అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్. దీంతో అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరు ఆప్ నేతల ఇళ్లకు ఏసీబీ అధికారుల బృందాలు బయలుదేరాయి.


నిగ్గు తేల్చాల్సిందే!

బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. దీనిపై సీరియస్ అయిన బీజేపీ.. నిజానిజాల నిగ్గు తేల్చాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఎల్జీ వెంటనే విచారణకు ఆదేశించారు. ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా యాంటీ కరప్షన్ బ్యూరోను ఆదేశించారు. కాగా, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇదే నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరి.. ఢిల్లీ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.


ఇవీ చదవండి:

మహా కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు..

బీజేపీ రాష్ట్ర చీఫ్ డిమాండ్.. పంట రుణాలు మాఫీ చేయాలి

అప్పుడే ఎండలు.. సాధారణం కన్నా 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2025 | 02:28 PM