Luxury Bunkers: యుద్ధం వచ్చినా బంకర్‌లో సేఫ్
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:12 AM
అణుయుద్ధాలు జరిగినా, భయంకరమైన విపత్తులు సంభవించినా.. ప్రాణాలకు ప్రమాదం లేని అత్యంత దుర్భేద్యమైన బంకర్లను నిర్మిస్తామని, వాటిల్లో సురక్షితంగా ఉండవచ్చని ప్రకటించింది. అయితే, ఇవి సాధారణ ప్రజల కోసం కాదు.. సంపన్నులు, సెలబ్రిటీల కోసం. ఒక్కో బంకర్ ఖరీదు 2 కోట్ల డాలర్లు (రూ.172 కోట్లు).

యుద్ధాలు, ప్రకృతి విపత్తుల వేళ ప్రాణరక్షణ కోసం బంకర్లు.. ఒక్కో దాని ఖరీదు 2 కోట్ల డాలర్లు
దుర్భేద్యమైన భద్రత, అత్యాధునిక సదుపాయాలు
అమెరికా కంపెనీ ‘సేఫ్’ ప్రాజెక్టు
న్యూయార్క్, మార్చి 14: దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు, ప్రకృతి ప్రకోపించి భారీ విపత్తులు సంభవించినప్పుడు ఎవరి ప్రాణాలకూ గ్యారెంటీ ఉండదు. సరిగ్గా.. ఇదే పాయింట్‌ను పట్టుకొని ఓ అమెరికా కంపెనీ కొత్త వ్యాపారం మొదలుపెట్టింది. అణుయుద్ధాలు జరిగినా, భయంకరమైన విపత్తులు సంభవించినా.. ప్రాణాలకు ప్రమాదం లేని అత్యంత దుర్భేద్యమైన బంకర్లను నిర్మిస్తామని, వాటిల్లో సురక్షితంగా ఉండవచ్చని ప్రకటించింది. అయితే, ఇవి సాధారణ ప్రజల కోసం కాదు.. సంపన్నులు, సెలబ్రిటీల కోసం. ఒక్కో బంకర్ ఖరీదు 2 కోట్ల డాలర్లు (రూ.172 కోట్లు). ఈ బంకర్లలో అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సకు ఉన్నంతటి రక్షణ ఉంటుందని సదరు కంపెనీ.. ‘స్ట్రాటెజికల్లీ ఆర్మర్డ్ ఫోర్టిఫైడ్ ఎన్విరాన్‌మెంట్స్’ (సేఫ్) చెబుతోంది. అమెరికాలోని 50 నగరాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి ప్రాంతాల్లో ఈ అత్యాధునిక లగ్జరీ బంకర్లను నిర్మించబోతున్నామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు ఏరీ అని పేరు పెట్టింది. మొట్టమొదట అమెరికాలోని వర్జీనియాలో 625 మందికి సరిపోయే బంకర్లను వచ్చే ఏడాది నిర్మిస్తామని సేఫ్ అధిపతి అల్ కోర్బి తెలిపారు. ‘వీటిలో ఉండే వారికి దేశాధినేతలకు ఉండే భద్రత కన్నా ఎక్కువ భద్రత ఉంటుంది. అత్యంత సురక్షితమైన ప్రదేశంలో ఉన్నామన్న భావన వారికి కలుగుతుంది. విపత్కర సమయాల్లో వారు తమ ఇళ్లను వదిలిపెట్టి ఇక్కడ ఎటువంటి ఆందోళన లేకుండా గడపవచ్చు’ అని వివరించారు.
భూగర్భంలో సురక్షితంగా..
సేఫ్ నిర్మించబోయే బంకర్లు భూమికి 200 అడుగుల దిగువన ఉంటాయి. పేలుడు పదార్థాలు, బాంబులు కూడా ఏమీ చేయలేని దృఢత్వంతో వీటి గోడలను నిర్మిస్తారు. బంకర్లలో సురక్షితమైన హైస్పీడ్ లిఫ్టులను ఉపయోగిస్తారు. ఇక సదుపాయాల విషయానికొస్తే.. కృత్రిమమేధతో కూడిన ఆరోగ్య సదుపాయాలు, స్విమ్మింగ్ పూల్స్, డైనింగ్ సౌకర్యాలు, బయోమెట్రిక్ వ్యవస్థలు, ఇంటరాక్టివ్ టెక్నాలజీతో కూడిన గోడలు, పైకప్పు, లైటింగ్ వంటివి ఉంటాయి. ఖరీదును బట్టి సదుపాయాలు కూడా మారుతాయి. రెండు వేల అడుగుల విస్తీర్ణం నుంచి 20 వేల అడుగుల విస్తీర్ణం వరకూ రకరకాల సైజుల్లో బంకర్లు ఉంటాయి. ఏరీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఫోర్బ్స్ వెబ్‌సైట్.. ‘డూమ్స్‌డే బంకర్ల’ పేరుతో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Read Latest AP News And Telugu News