Share News

పవన్‌ బీజేపీ నేతలా మాట్లాడటం తగదు: సీపీఐ

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:01 AM

జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగం బీజేపీ స్ర్కిప్ట్‌ చదివినట్లుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

పవన్‌ బీజేపీ నేతలా మాట్లాడటం తగదు: సీపీఐ

అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన ప్రసంగం బీజేపీ స్ర్కిప్ట్‌ చదివినట్లుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ‘త్రిభాషా విధానం అమలు చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. హిందీ భాషను బలవంతంగా అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా పవన్‌ బీజేపీ నేతలా మాట్లాడటం తగదు’ అని రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. హిందీ రాష్ట్రాల్లో దక్షిణాది భాషను మూడో భాషగా అమలు చేస్తారా? అని ప్రశ్నించారు.


హోంగార్డుల వేతనాలను రూ. 25 వేలకు పెంచాలి

తెలంగాణలో మాదిరే ఏపీలో హోంగార్డుల వేతనాన్ని రూ.25 వేలకు పెంచాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. హోంగార్డుల కుటుంబ సభ్యులకూ ఆరోగ్య బీమా కల్పించాలని కోరుతూ హోం మంత్రికి లేఖ రాశారు.

Updated Date - Mar 16 , 2025 | 05:02 AM