Share News

Nithyananda Mystery: నిత్యానంద సజీవ సమాధి

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:14 AM

స్వామి నిత్యానంద రెండు రోజుల క్రితం సజీవ సమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్‌ ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఆయన భక్తులలో విషాదం నెలకొంది, నిత్యానంద ఆస్తులు ఇప్పుడు రంజితకే చేరే అవకాశం ఉందని సమాచారం

Nithyananda Mystery: నిత్యానంద సజీవ సమాధి

ప్రకటించిన మేనల్లుడు సుందరేశ్వరన్‌

చెన్నై, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద రెండు రోజుల క్రితం సజీవ సమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్‌ ప్రకటించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణత్యాగం చేసి, సమాధి చెందారని సామాజిక మాధ్యమాల ద్వారా వివరించారు. నిత్యానంద అధికారిక వెబ్‌సైట్‌ గానీ, యూట్యూబ్‌ చానల్‌ గానీ సుందరేశ్వరన్‌ ప్రకటనను ఖండించకపోవడంతో ఆయన భక్తగణం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అదే సమయంలో నిత్యానంద వేంకటేశ్వరమూర్తి భావసమాధి దర్శనం పేరుతో శ్రీవారి వేషంలో ఆయన దర్శనమిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వెలువడటం కలకలం రేపుతోంది. కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈ సజీవ సమాధి ప్రకటన అంటూ నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిత్యానందకు అభిమానులు, భక్తులు, అనుచరులు పెద్దసంఖ్యలో ఉన్నారు. తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్‌ తదితర 41 ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలున్నాయి. 15ఏళ్ల క్రితం నిత్యానంద ఒక ప్రముఖ నటితో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనం సృష్టించింది. వందలాది మంది మహిళా శిష్యురాళ్లను తప్పుదారి పట్టించడం, మనీలాండరింగ్‌కు పాల్పడటంతో పాటు భూకబ్జాలకు సంబంధించి ఆయనపై పలు ఆరోపణలున్నాయి. బెంగుళూరు, అహ్మదాబాద్‌లో మహిళలపై నిత్యానంద అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2020లో దేశం వదిలిపోయిన నిత్యానంద.. పసిఫిక్‌ దీవుల్లో ‘కైలాస’ పేరుతో దేశాన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రకటించారు.


ఆ ఆస్తులన్నీ రంజితకేనా..?

స్వామీజీ అవతారంలో ఉన్నప్పటికీ నిత్యానంద విలాసవంతమైన జీవితాన్నే అనుభవించారు. రూ.వందల కోట్లతో కైలాస దీవి కొనుగోలు చేసినట్లు సన్నిహిత భక్తులు చెబుతున్నారు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.4వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆయన మరణించినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో.. ఆ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయనే చర్చ మొదలైంది. సుదీర్ఘకాలంగా నిత్యానంద శిష్యురాలిగా, భాగస్వామిగా ఉన్న నటి రంజితకే అవన్నీ చెందుతాయని శిష్యగణం చెబుతోంది. వాటి నిర్వహణ బాధ్యతలు కూడా చూస్తున్నారని భక్తులు చెబుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..

Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి

Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు

Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్

For Latest National News , National News in Tel

Updated Date - Apr 02 , 2025 | 05:14 AM