PM Modi: మోదీకి శ్రీలంక 'మిత్ర విభూషణ' పురస్కారం
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:52 PM
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. ఇరుదేశాల మధ్య చిరకాలంగా ఉన్న మైత్రి, చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు.

కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి ఆ దేశ అత్యున్నత పురస్కారమైన 'మిత్ర విభూషణ' (Mitra Vibhushana) ప్రదానం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. ఇరుదేశాల మధ్య చిరకాలంగా ఉన్న మైత్రి, చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ప్రధాని మోదీ అర్హులని ఈ సందర్భంగా దిశనాయకే కొనియాడారు. ఇందుకు మోదీ స్పందిస్తూ, ఇది తనకు మాత్రమే దక్కిన పురస్కారం కాదని, 140 కోట్ల భారతీయుల తరఫున దక్కిన గౌరవమని అన్నారు. అవార్డును ప్రదానం చేసిన శ్రీలంక ప్రభుత్వం, ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.
PM Modi Srilanka: శ్రీలంకలో ప్రధాని మోదీకి అరుదైన స్వాగతం.. కీలక ఒప్పందాలు
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే సంయుక్త ప్రకటన చేశారు. విదేశీ ప్రముఖులకు ఇచ్చే ప్రతిష్టాత్మక 'మిత్ర విభూషణ్' పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయడం గర్వకారణంగా భావిస్తున్నామని దిశనాయకే అన్నారు. 2008లో ఈ అవార్డును ప్రారంభించామని, మైత్రీ సంబంధాలను పాదుకొలపడంలే విశేష కృషి చేసినందుకు ఇచ్చే ఈ అవార్డుకు మోదీ అర్హులని తాము బలంగా నమ్ముతున్నామని అన్నారు. ప్రధాని మోదీ స్పందిస్తూ, శ్రీలంక మిత్ర విభూషణ్ పురస్కారం అందుకోవడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ అవార్డు భారత్-శ్రీలంక మధ్య చిరకాల మైత్రీ సంబంధాలు, చారిత్రక సంబంధాలకు ప్రతీక అని కొనియాడారు. శ్రీలంక అధ్యక్షుడికి, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మోదీ తన పర్యటనలో భాగంగా దిశనాయకేతో కలిసి వ్యవసాయ రంగంలో హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డవలప్‌మెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. 120 మెగావాట్ల సాంపూర్ సోలార్ ప్రాజెక్టును వర్చువల్ తరహాలో ప్రారంభించారు. మోదీ 2019 తర్వాత శ్రీలంకలో పర్యటించడం ఇదే మొదటిసారు. ధాయ్‌లాండ్‌లో బిమ్‌స్టెక్ సదస్సుకు హాజరైన అనంతరం శ్రీలంక చేరుకున్న మోదీకి విమానాశ్రయంలో శ్రీలంక మంత్రులు ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మోదీ శ్రీలంక అధ్యక్షుడు అనురతో ద్వైపాక్షిక చర్చలు జరిపి, రక్షణ, డిజిటల్, ఇంధన భద్రత తదితర రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. 6న దిశనాయకేతో కలిసి అనురాధపురాలోని మహాబోధి ఆలయాన్ని మోదీ సందర్శిస్తారు.
ఇవి కూడా చదవండి..
Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్, ఓపీఎస్ భేటీ
Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం
For National News And Telugu News