Rahul Gandhi: సావర్కర్ కేసులో విచారణకు గైర్హాజర్.. రాహుల్‌గాంధీకి రూ.200 ఫైన్

ABN, Publish Date - Mar 05 , 2025 | 06:21 PM

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఆ కారణంగా విచారణకు హాజరుకాలేరని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

Rahul Gandhi: సావర్కర్ కేసులో విచారణకు గైర్హాజర్.. రాహుల్‌గాంధీకి రూ.200 ఫైన్

లక్నో: లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి లక్నో (Lucknow) కోర్టు రూ.200 జరిమానా విధించింది. స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్‌ (Savarkar)పై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు రాహుల్ గైర్హాజర్ కావడంతో కోర్టు సీరియస్ అయింది. ఆయనకు జరిమానా విధిస్తూ ఏప్రిల్ 14న తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది.

Tamil Nadu: 1971 జనాభాలెక్కలు ఆధారంగా డీలిమిటేషన్.. ప్రధానికి తమిళనాడు అఖిలపక్షం వినతి


ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ బుధవారంనాడు హాజరు కావాల్సి ఉండగా, వ్యక్తిగత హాజరునించి ఆయనను మినహాయించాలని రాహుల్ తరఫు లాయర్ కోర్టును కోరారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఆ కారణంగా విచారణకు హాజరుకాలేరని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. హాజరుకానుందుకు రూ.200 జరిమానా విధిస్తూ, ఏప్రిల్ 14న కచ్చితంగా తమ మందుహాజరు కావాలని ఆదేశించింది.


కేసు ఏమిటి?

మహారాష్ట్రలోని అకోలాలో కొద్దికాలం క్రితం జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, బ్రిటిష్ వారికి సావర్కర్ లేఖ రాశారని, తన చర్యలకు క్షమాపణ చెప్పారని, తద్వారా మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్ర్య యోధుల పోరాటాన్ని నీరుగార్చారని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. సావర్కర్‌ను కించపరచేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది నృపేంద్ర పాండే కేసు వేశారు. వీరసావర్కర్‌ను ఆంగ్లేయుల సర్వెంట్‌గా, పెన్షనర్‌గా రాహుల్ పేర్కొన్నారని, తన వ్యాఖ్యల ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల వారసత్వాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడారని, సమాజంలో విభజలను ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ క్రమంలో సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) కింద పాండే దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారితో విచారణ జరిపించాలని హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కేసు విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గైర్హాజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తదుపరి విచారణకు హాజరుకాకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి

Aurangzeb Row: అబూ అజ్మీని యూపీ పంపండి.. గట్టి ట్రీట్‌మెంట్ ఇస్తాం: యోగి

Arvind Kejriwal: ట్రంప్‌ను మించిన సెక్యూరిటీతో ధ్యాన కేంద్రానికి కేజ్రీవాల్

Former Minister: హీరో విజయ్‌ది పగటికలే.. అందరూ ఎంజీఆర్‌ కాలేరు

Hero Vishal: హీరో విశాల్‌ ప్రశ్న.. విజయ్‌ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2025 | 06:52 PM