Share News

Reels: రీల్స్ పిచ్చితో వార్డ్ బాయ్ అత్యుత్సాహం.. కట్ చేస్తే

ABN , Publish Date - Apr 16 , 2025 | 09:00 AM

రీల్స్ పిచ్చితో ఓ వార్డ్ బాయ్ అరాచాకానికి పాల్పడ్డాడు. అతడు చేసిన పని కాస్త వైరల్ కావడంతో.. ఆస్పత్రి యాజమాన్యం.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంది. ఆ వివరాలు..

Reels: రీల్స్ పిచ్చితో వార్డ్ బాయ్ అత్యుత్సాహం.. కట్ చేస్తే
Rajasthan Ward Boy

జైపూర్: సోషల్ మీడియా రెండు వైపుల పదునున్న కత్తిలాంటిది. దీన్ని వల్ల లాభం ఎంతుందో.. అదమరిస్తే నష్టం అంతకంటే తీవ్రంగా ఉంటుంది. రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారాలంటే అది కేవలం సోషల్ మీడియా వల్లే అవుతుంది. నేటి సమాజంలో చాలా మందిలో ఈ పిచ్చి ముదురుతోంది. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం రకరాల స్టంట్స్ చేసి అభాసుపాలవుతున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక తాజాగా ఈకోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. రీల్స్ పిచ్చితో ఓ వార్డ్ బాయ్ ఎంతటి అరాచకానికి పాల్పడ్డాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే.


వార్డ్ బాయ్ కాస్త డాక్టర్ అవతారం ఎత్తి రోగులకు చికిత్స అందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ సంఘటన రాజస్థాన్, అల్వార్‌లో చోటు చేసుకుంది. రీల్స్ పిచ్చితో వార్డ్ బాయ్ ఒకరు అరాచకానికి పాల్పడ్డాడు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడాడు. వారికి ఇంజెక్షన్స్ వేయడమే కాక.. డ్రిప్స్ కూడా పెట్టాడు. వీడియో కాస్త వైరల్ కావడం.. అది ఆస్పత్రి ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో.. వారు సదరు వార్డ్ బాయ్‌ని విధుల నుంచి తొలగించారు.


ఈ సంఘటన అల్వార్, రాజీవ్ గాంధీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కాంట్రాక్ సిబ్బందిగా చేరిన వార్డ్ బాయ్.. రీల్స్ పిచ్చితో ఇంత పని చేశాడు. నర్సింగ్ ఆఫీసర్ చైర్‌లో కూర్చుని రిజిస్టర్‌లో ఎంట్రీలు రాశాడు. ఆ తర్వాత రోగుల వద్దకు వెళ్లి వారికి ఇంజెక్షన్స్ వేశాడు.. డ్రిప్స్ పెట్టాడు. ఈ తతంగాన్ని వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.


వార్డ్ బాయ్‌పై వేటు..

విషయం కాస్త ఆస్పత్రి ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో.. వారు సదరు వార్డ్ బాయ్ మీద వేటు వేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం మాట్లాడుతూ.. "సదరు వార్డ్ బాయ్ కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగి. వీడియో కూడా కొన్ని రోజుల క్రితంది. పేషెంట్స్‌కి చికిత్స చేసే సమయంలో వీడియోలు, ఫొటోలు తీసుకోవడం నిషేధం. అలా చేస్తే వారి గోప్యతకు భంగం కలిగించినట్లే అవుతుంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వార్డ్ బాయ్ విషయంలో కూడా అదే చేశాం" అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

Air Hostess: ఎయిర్‌హోస్టేస్‌పై దారుణం.. వెంటిలేటర్ మీద ఉన్నా ఆగని వేధింపులు

Earthquake: ఆ దేశంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి

Updated Date - Apr 16 , 2025 | 09:02 AM