Share News

Supreme Court: రణవీర్ అలహాబాదియాపై ధర్మాసనం సీరియస్

ABN , Publish Date - Feb 18 , 2025 | 01:15 PM

ఇటీవల ఒక టీవీ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ యూట్యూబర్‌ రణవీర్‌ అలహాబాదియాపై సుప్రీం ధర్మాసనం సీరియస్ అయింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్ట్ సరండర్ చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Supreme Court:  రణవీర్ అలహాబాదియాపై ధర్మాసనం సీరియస్
Ranveer Allahbadia case

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తనపై నమోదైన అనేక ఎఫ్‌ఐఆర్‌ (FIR)లను సవాలు చేస్తూ ప్రముఖ యూట్యూబర్‌ (YouTuber) రణవీర్‌ అలహాబాదియా (Ranveer Allahbadia) సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. యూట్యూబ్‌లో కమెడియన్‌ సమయ్‌ రైనాకు చెందిన ఇండియాస్‌ గాట్‌ లేటెంట్‌ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అలహాబాదియాపై దేశవ్యాప్తంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీనిపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు విచారణ కొనసాగింది. ఇటీవల ఒక టీవీ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసిన రణవీర్ అలహాబాదియాపై ధర్మాసనం సీరియస్ అయింది. దేశం విడిచి వెళ్లొద్దని, పాస్ పోర్ట్ సరండర్ చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ వార్త కూడా చదవండి..

నోటీసు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయిన ముద్రగడ


జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు..

‘‘మీరు చేసిన ప్రకటనలను సమర్థిస్తున్నారా ... అశ్లీలత,అసభ్యత యొక్క పరిమితులు ఏమిటి... ఈ దేశంలో ఇది అసభ్యత కాకపోతే, మరి ఏమిటి.. మీరు ఉపయోగిస్తున్న భాషను చూడండి.. మీకు అన్ని రకాలుగా మాట్లాడటానికి లైసెన్స్ ఉందా...’’ అని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ప్రశ్నించింది. తల్లిదండ్రులను కూడా అవమానిస్తున్నారని, ఈ కార్యక్రమం ద్వారా ఈ వ్యక్తి మనసులో ఏదో మురికి ప్రచారం చేయబడిందని, కోర్టులు అతనికి ఎందుకు అనుకూలంగా ఉండాలని ధర్మాసనం ప్రశ్నించింది. అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రణవీర్‌పై అనేక రాష్ట్రాలలో పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా వివిధ రాష్ట్రాలలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను జత చేయాలని రణవీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే మహారాష్ట్ర, అస్సాంలో యూట్యూబర్ రణవీర్‌పై కేసులు నమోదు అయ్యాయి. కాగా అలహాబాదియా తరఫున మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ తనయుడు, న్యాయవాది అభినవ్‌ చంద్రచూడ్‌ వాదనలు వినిపించారు.


కాగా వావివరుసలు, ఇంగితం లేకుండా తల్లిదండ్రుల గురించి అసభ్యకరమైన (ప్రచురించటానికి వీలు లేని) భాషలో మాట్లాడిన రణ్‌వీర్‌ అలహాబాదియా.. తన సోషల్‌ మీడియా అకౌంట్లలో వేల సంఖ్యలో ఫాలోవర్లను కోల్పోతున్నారు. గడిచిన కొన్ని రోజుల్లోనే దాదాపు 1,42,000 మంది రణ్‌వీర్‌ను అఅన్‌సబ్‌స్క్రైబ్ చేసుకున్నారని వెల్లడైంది. ఇప్పటి వరకూ రణ్‌వీర్‌ ఫాలోవర్లుగా ఉన్న అనేక మంది అతడి మాటలను ఈసడించుకుంటూ, తీవ్రమైన కామెంట్లు పెడుతూ.. అతడి ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ చానళ్ల నుంచి వైదొలుగుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాగ్‌రాజ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్

మూడు రోజుల పాటు కాలువలోనే..

సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్‌ను ప్రారంభించనున్న సీఎం

సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 18 , 2025 | 01:15 PM