Saif Ali Khan: సొంత మనుషులే చంపాలని చూశారా.. సైఫ్ కేసులో నయా ట్విస్ట్
ABN , Publish Date - Jan 22 , 2025 | 02:53 PM
Saif Ali Khan Case: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ కేసులో సొంత మనుషులే సైఫ్‌ను చంపాలని చూశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన సైఫ్.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఎట్టకేలకు కోలుకోవడంతో మంగళవారం ఆయన్ను డిచ్చార్జ్ చేశారు. దీంతో హాస్పిటల్ నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లిపోయాడు సైఫ్. అయితే ఆయన కంప్లీట్‌గా రికవర్ అయ్యేందుకు మరికొంత టైమ్ పడుతుందన్నారు డాక్టర్లు. ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉండటంతో కొన్నాళ్ల పాటు సైఫ్‌ను ఎవరూ కలిసే అవకాశం లేదు. ఒకవైపు సైఫ్ కోలుకోవడం, మరోవైపు నిందితుడు దొరకడంతో అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈ కేసులో మాత్రం రోజురోజుకీ ఊహించని ట్విస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి.
ఎవరి పని?
సైఫ్ మీద జనవరి 16వ తేదీ తెల్లవారుజామున దాడి జరిగిన సంగతి తెలిసిందే. బాండ్రాలోని ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ చోరీకి ప్రయత్నించాడు. అతడ్ని ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా.. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన గట్టిగా అరవడంతో దుండగుడు అక్కడి నుంచి తక్షణమే పారిపోయాడు. ఆ వెంటనే సైఫ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఇంట్లోని పని మనిషి వాంగ్మూలంలో మాత్రం కొత్త విషయం బయటపడింది. దుండగుడు షరీఫుల్‌ను తామందరం కలసి రూమ్‌లో బంధించామని సైఫ్ ఇంట్లో పనిచేసే ఎలియామా ఫిలిప్ అనే మహిళ తెలిపింది. అతడ్ని బంధించిన తాము పైఅంతస్తుకు వెళ్లిపోయామని చెప్పింది. దీంతో ఆ రూమ్‌లో నుంచి అతడు ఎలా పారిపోయాడు? తప్పించుకునేందుకు షరీఫుల్‌కు ఎవరు సాయం చేశారు? సైఫ్ సొంతమనుషులే ఈ అటాక్ చేయించారా? ఆయన ప్రాణాలు తీయాలని చూశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
డోర్ లాక్ చేసి..!
‘ఏదో శబ్దం వినిపించి నిద్రలేచా. చూస్తే బాత్రూమ్ నుంచి ఓ వ్యక్తి బయటకు రావడం కనిపించింది. దీంతో వెంటనే జే (సైఫ్ తనయుడు) రూమ్‌కు వెళ్లా. దీంతో ఎవరూ బయటకు వెళ్లొద్దంటూ దుండగుడు వార్నింగ్ ఇచ్చాడు. అతడి చేతిలో ఓ వెదురు కర్ర, హెక్సా బ్లేడ్ ఉన్నాయి. జే కోసం పరిగెత్తగానే అతడు నాపై దాడి చేశాడు. నేను అతడ్ని ఆపేందుకు ప్రయత్నించా. ఈ క్రమంలో బ్లేడ్ తగలడంతో నా వేళ్లు కోసుకున్నాయి. సైఫ్ సార్ అతడ్ని కాసేపు నిలువరించడంతో ఆ తలుపులకు గడియ పెట్టి పై ఫోర్‌కు పరిగెత్తాం’ అని ఎలియామా ఫిలిప్ చెప్పుకొచ్చింది. డోర్ లాక్ చేసి వెళ్లినప్పడు దుండగుడు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది. అసలు నిజం ఏంటో విచారణ పూర్తయ్యేసరికి బయటపడుతుందేమో చూడాలి.
ఇవీ చదవండి:
గోమూత్రం తాగితే టాస్మాక్ విక్రయాలు తగ్గుతాయి...
బీజేపీ రాష్ట్ర చీఫ్ అంతమాట అనేశారేంటి
75 యేళ్లుగా చెక్కుచెదరని రహదారి
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి