Judges Asset Details: న్యాయమూర్తుల ఆస్తులపై కీలక నిర్ణయం
ABN , Publish Date - Apr 03 , 2025 | 02:30 PM
Judges Asset Details: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో ఇటీవల నోట్ల కట్టలు లభించిన నేపథ్యంలో న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫుల్ కోర్టు సమావేశంలో ఆస్తులకు సంబంధించి జడ్జిలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: న్యాయమూర్తుల ఆస్తుల వివరాలకు సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. పుల్ కోర్టు సమావేశంలో ఆస్తుల వివరాల వెల్లడికి న్యాయమూర్తులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. ప్రతి ఏడాదీ క్రమంగా తమ ఆస్తుల వివరాలను భారత ప్రధాన న్యాయమూర్తికి వెల్లడించడానికి న్యాయమూర్తులు అంగీకరించారు. న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను సుప్రీం కోర్టు (Supreme Court) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు లభించిన నేపథ్యంలో న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించడంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫుల్‌కోర్టు సమావేశంలో తమ ఆస్తులను భారత న్యాయమూర్తికి వెల్లడించేందుకు అంగీకరించారు.
గతంలో కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలపై కొంతమేర చర్చ జరిగింది. 2009లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించాలని కొంతమంది పేర్కొన్నారు. దానిపై ఒత్తిడి పెరిగినప్పటికీ ఆస్తుల ప్రకటన అనేది స్వచ్ఛందంగా ఎవరైనా వెల్లడించవచ్చు కానీ... కచ్చితంగా వెల్లడించాలన్న నియమం లేదు. న్యాయమూర్తుల ఆస్తులకు సంబంధించి అనేక చర్చలు జరిగాయి. ఆ సమయంలో పలువురు న్యాయమూర్తులు స్వచ్ఛందంగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు ముందుకు వచ్చారు కూడా. కానీ మరికొందరు మాత్రం దాన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా భావించారు.
Lokesh Mangalagiri Dvelopment: అందులో మంగళగిరిని టాప్‌లో ఉంచుతాం
అయితే ప్రస్తుతం ఫుల్ కోర్టు సమావేశంలో ఆస్తుల వివరాలను వెల్లడించేందుకు న్యాయమూర్తులంతా ఏకగ్రీవంగా అంగీకరించడం ఇదే తొలిసారి. దీని వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగే అవకాశం ఉంది అనేది జడ్జిలు చెబుతున్నారు. న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన అనేది చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇంతకు ముందు కేవలం సీబీఐ మాత్రమే ఆస్తుల వివరాలను వెల్లడించడం జరిగేది.. కానీ వాటిని వెబ్‌సైట్‌లో పెట్టలేదు. కానీ ఇప్పుడు సీజేఐ, ఇతర న్యాయమూర్తులు అందరూ కూడా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నారు.
ఇవి కూడా చదవండి
Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest National News And Telugu News