Aliens: భూమిపై ఏలియన్స్!
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:06 AM
ది ఏజ్ ఆఫ్ డిస్‌క్లోజర్’ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు. ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు (యూఏపీ) ఉన్నాయని, వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో 34 మంది మిలిటరీ, నిఘా అధికారులు పేర్కొన్నారు.

1940ల నుంచి అంతరిక్షనౌక వచ్చి వెళ్తోంది
మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు
వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు
న్యూఢిల్లీ, మార్చి 14: ఇప్పటి వరకు గ్రహాంతర వాసులు (ఏలియన్స్) ఉన్నారని, లేరని ఎడతెగని వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు భూమిపైనే వారి ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు. ‘ది ఏజ్ ఆఫ్ డిస్‌క్లోజర్’ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు. ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు (యూఏపీ) ఉన్నాయని, వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసని ఆ డాక్యుమెంటరీలో 34 మంది మిలిటరీ, నిఘా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం భూమిపైనే గ్రహాంతరవాసుల ఉంటున్నారని వారు కుండబద్దలు కొట్టారు. ఈ విషయంపై తమకు నేరుగానే అవగాహన ఉందని ఆ డాక్యుమెంటరీలో కొంత మంది వెటరన్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞాన పరంగా మనం ఎంత అభివృద్ధి సాధించామో పరిశీలించడానికి 1940ల నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక భూమిపైకి వచ్చి వెళుతోందని తెలిపారు. ఈ విషయాలు తెలిసి కూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తోందంటూ విమర్శించారు.
దేశ భద్రతకే ఇది పెద్ద ముప్పుగా పరిణమించబోతోందని అభిప్రాయపడ్డారు. గ్రహాంతర వాసుల యూఏపీల వేగం మన అత్యంత వేగవంతమైన ఎయిర్‌క్రా్‌ఫ్టల కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని, వాటి వేగం గంటకు 50 వేల మైళ్లు దాటి ఉంటుందని వారు వెల్లడించారు. ఆ డాక్యుమెంటరీలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, న్యూయార్క్ సెనేటర్ కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్ కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు. నిఘా అధికారుల వాదనను వారు కొట్టిపాడేశారు. ఆ యూఏపీలు ఖండాంతర ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చని గిల్లిబ్రాండ్ అన్నారు. చైనా, రష్యా లేదా వేరే శత్రుదేశాలకు చెందినవి అయ్యిండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రపంచ మిలిటరీ శక్తి సామర్థ్యాలను గ్రహంతర వాసులు పరిశీస్తున్నారని నమ్ముతున్నట్లు మాజీ మిలిటరీ అధికారి ఎలిజోండో చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Read Latest AP News And Telugu News