Green Card: గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన శాశ్వత నివాసం లభించదు
ABN , Publish Date - Mar 15 , 2025 | 05:03 AM
గురువారం ఫాక్స్ న్యూస్ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. గ్రీన్‌కార్డుదారులకు అమెరికాలో నిరవధికంగా ఉండే హక్కు లేదని తెలిపారు. ‘ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు. నా ఉద్దేశం ప్రకారం ఇది జాతీయ భద్రతకు సంబంధించినది. అన్నిటికంటే ముఖ్యంగా మా సమాజంలోకి ఎవరిని కలుపుకోవాలనే విషయాన్ని అమెరికా పౌరులుగా మేము నిర్ణయిస్తాం.

ఆ విషయాన్ని అమెరికన్లమైన మేం నిర్ణయిస్తాం: జేడీ వాన్స్
న్యూఢిల్లీ, మార్చి 14: గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన వలసదారులకు అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు లభించదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. గురువారం ఫాక్స్ న్యూస్ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. గ్రీన్‌కార్డుదారులకు అమెరికాలో నిరవధికంగా ఉండే హక్కు లేదని తెలిపారు. ‘ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు. నా ఉద్దేశం ప్రకారం ఇది జాతీయ భద్రతకు సంబంధించినది. అన్నిటికంటే ముఖ్యంగా మా సమాజంలోకి ఎవరిని కలుపుకోవాలనే విషయాన్ని అమెరికా పౌరులుగా మేము నిర్ణయిస్తాం. ఒక వ్యక్తి అమెరికాలో ఉండకూడదని, ఇక్కడ ఉండటానికి వారికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదని దేశాధ్యక్షుడే నిర్ణయం తీసుకుంటే.. ఇక ఇందులో రెండో ఆలోచనే లేదు’ అని వాన్స్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా గతంలో జరిగిన నిరసనల్లో పాల్గొన్నందుకు గ్రీన్‌కార్డుదారుడైన కొలంబియా వర్సిటీ విద్యార్థి మహమూద్ ఖలీల్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఖలీల్ గ్రీన్‌కార్డును ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇచ్చారు.
జన్మత: పౌరసత్వంపై సుప్రీంకోర్టుకు ట్రంప్ ప్రభుత్వం
వాషింగ్టన్, మార్చి14: జన్మత: పౌరసత్వంపై ఆంక్షలను పాక్షికంగానైనా అమలు చేయడానికి అనుమతించాల్సిందిగా అమెరికా సుప్రీంకోర్టును ట్రంప్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ట్రంప్ సర్కారు సుప్రీంకోర్టులో గురువారం అత్యవసర పిటిషన్లు వేసింది. జన్మత: పౌరసత్వాన్ని నిషేధిస్తూ ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఇప్పటికే మేరీల్యాండ్, మసాచుసెట్స్, వాషింగ్టన్ జిల్లా జడ్జీలు నిలుపుదల ఉత్తర్వులు
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..
Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
Read Latest AP News And Telugu News