Share News

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ABN , Publish Date - Mar 01 , 2025 | 02:48 PM

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి మాట్లాడుతూ, మొత్తం 48 మందిని సహాయక బృందాలు రక్షించాయని చెప్పారు. జాడ తెలియకుండా పోయిన ఏడుగురుని కనిపెట్టే చర్యలు చురుగ్గా సాగుతున్నట్టు తెలిపారు.

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

చమోలి: మంచు మేటలను తొలగించే పనులో ఉండగా భారీగా మంచు చరియలు విరిగిపడి వాటికింద చిక్కుకుపోయిన 55 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్-టిబెట్ సరిహద్దుల్లోని ఛమోలి జిల్లా మనా గ్రామం వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. తొలుత 33 మందిని రక్షించగా, శనివారం ఉదయం మరో 14 మందిని రక్షించారు. అయితే చికిత్స పొందుతూ నలుగురు మృత్యువాత పడినట్టు సమాచారం. మరోవైపు, మంచు చరియలు కింద చిక్కుకున్న తక్కిన వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Bengaluru: 22న కర్ణాటక రాష్ట్ర బంద్‌..


కాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి మాట్లాడుతూ, మొత్తం 48 మందిని సహాయక బృందాలు రక్షించాయని చెప్పారు. జాడ తెలియకుండా పోయిన ఏడుగురుని కనిపెట్టే చర్యలు చురుగ్గా సాగుతున్నట్టు తెలిపారు. తీవ్రంగా మంచు పడుతుండటంతో సహాయక కార్యక్రమాలకు అవాంతరాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ధారాపాతంగా కురుస్తున్న మంచుతో ఐదు బ్లాక్‌లలో విద్యుత్, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని, సాధ్యమైనంత త్వరగా వీటిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. సహాయక చర్యలకు 200 మంది సిబ్బందిని మోహరించామని, గాయపడిన 23 మంది కార్మికులను చికిత్స కోసం జోషిమఠ్ తరలించామని చెప్పారు. కొందరు తీవ్రంగా గాయపడగా, దాదాపు అందరి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. సహాయక కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం సమీక్షించారని, ఎలాంటి సాయమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారని తెలిపారు.


47 మందిని కాపాడాం: ఐటీబీపీ

మంచు చరియల కింద కూరుకుపోయిన 55 మందిలో 47 మందిని రక్షించామని, ఫ్రాక్చర్లు, తలకు గాయాలతో ఇద్దరు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఐటీబీపీ కమాండంట్ విజయ్ కుమార్ పి తెలిపారు. తక్కిన వారిని కూడా సాయంత్రానికల్లా రక్షించగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐజీ, డీఐజీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండగా, రెస్క్యూ టీమ్‌లు లోతైన మంచులో కూరుకుపోయిన వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తు్న్నాయి.


ఇవి కూడా చదవండి

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2025 | 03:12 PM