సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో డిప్లొమా అడ్మిషన్లు
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:47 AM
హైదరాబాద్ బాలానగర్‌లో ఉన్న ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్’(సీఐటీడీ)లో 2025-26 సంవత్సరానికి కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు....

హైదరాబాద్ బాలానగర్‌లో ఉన్న ‘సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్’(సీఐటీడీ)లో 2025-26 సంవత్సరానికి కింది డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. 1968లో ఏర్పాటైన కేంద్రప్రభుత్వ సంస్థ ఇది. ఇందులో సర్టిఫికెట్, డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, ఎంఈ, ఎంటెక్ కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ వెలువడింది.
కోర్సులు సీట్లు
డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్(డీటీడీఎం) 60
డిప్లొమా ఇన్ ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(డీఈసీఈ) 60
డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్(డీఏఆర్‌ఈ) 60
డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్(డీపీఈ) 60
(డీటీడీఎం కోర్సు నాలుగు సంవత్సరాలు - మిగిలిన కోర్సు మూడు సంవత్సరాలు)
విద్యార్హతలు: డీటీడీఎం కోర్సు చేయాలంటే కనీసం 50 శాతం మార్కులతో పది పాసై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం చాలు.
వయోపరిమితి: 2025 మే 22 తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 19 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు గరిష్ఠ వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక: జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలో చేయవచ్చు.
పరీక్ష విధానం: పదో తరగతి స్థాయిలో మేథ్స్, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతోపాటు,
ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్‌లపై ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 మే 22. ప్రవేశ పరీక్ష: 2025 మే 25
Contact Details: Admission Desk at Diploma Block
Ph: 9502405170, 040-29561795 E-Mail: training@citdindia.org,
Website: https://www.citdindia.org
Read Also : Business Ideas: రోజులో రెండు గంటలు ఈ పనిచేస్తే చాలు.. మహిళలకు ఇంటి ..
Business Plan : డబ్బుకు డబ్బు.. ఇంట్లోనే పని.. మహిళల కోసం బెస్ట్ ...
Business Ideas: పీఎం మోడీ చెప్పిన ఈ పంటకు పెట్టుబడి రూ.20వేలు ...