Share News

టెన్త్‌ తరవాత డిప్లొమా లెదర్‌ టెక్నాలజీతో కెరీర్‌

ABN , Publish Date - Apr 07 , 2025 | 05:19 AM

టెన్త్‌ తరవాత పాలిటెక్నిక్‌ డిప్లొమా చేయవచ్చని అందరికీ తెలిసిందే. అయితే మెకానికల్‌, సివిల్‌ వంటి రెగ్యులర్‌ కోర్సులతోపాటు పాలిటెక్నిక్‌లో ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి. ఈ డిప్లొమాలు చేస్తే ...

టెన్త్‌ తరవాత డిప్లొమా లెదర్‌ టెక్నాలజీతో కెరీర్‌

  • డిప్లొమా ఇన్‌ లెదర్‌ అండ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ

  • డిప్లొమా ఇన్‌ లెదర్‌ గూడ్స్‌ అండ్‌ ఫుట్‌వేర్‌ టెక్నాలజీ

టెన్త్‌ తరవాత పాలిటెక్నిక్‌ డిప్లొమా చేయవచ్చని అందరికీ తెలిసిందే. అయితే మెకానికల్‌, సివిల్‌ వంటి రెగ్యులర్‌ కోర్సులతోపాటు పాలిటెక్నిక్‌లో ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి. ఈ డిప్లొమాలు చేస్తే కాలేజీ పట్టాతోపాటే ఉద్యోగం వస్తుంది. పిన్నవయసులోనే మంచి జాబ్‌ సాధించవచ్చు. అంత డిమాండ్‌ ఉన్న బ్రాంచ్‌లు ఇవి. ఆ వరుసలో ప్రధానమైన డిప్లొమాల్లో లెదర్‌ టెక్నాలజీ ఒకటి. హైదరాబాద్‌లోని ‘గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెదర్‌ టెక్నాలజీ’లో మాత్రమే సంబంధిత డిప్లొమా కోర్సులు ఉన్నాయి.


ఫుట్‌వేర్‌(పాదరక్షలు), లెదర్‌ గార్మెంట్స్‌(తోలు వస్తువులు) ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంది. తోళ్లు/చర్మాల ఉత్పత్తిలో ఇండియా వాటా పదమూడు శాతం. భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేలకొద్ది లెదర్‌ గూడ్స్‌, ఫుట్‌వేర్‌ పరిశ్రమలు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. విదేశాల్లో లేబర్‌ వ్యయాలు అధికం. ఇండియాలో లేబర్‌ ఖర్చులు తక్కువ. నైపుణ్యాలు ఎక్కువ. ఉత్పత్తి వ్యయం కూడా మనదేశంలోనే తక్కువ. ఫలితంగా క్లార్క్స్‌, బాలే, ఆడిడాస్‌, ఎక్కో, బుగతి, రీబాక్‌, టింబర్‌లాండ్‌, కొలెహాన్‌, నైక్‌ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు తమ ఉత్పత్తి కేంద్రాలను మనదేశానికి మార్చుకున్నాయి. ఉత్పత్తి అయిన వస్తువులు ఆ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దాంతో ఇక్కడి కంపెనీలు పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందగలుగుతున్నాయి.

మరో అంశం, ఈ రంగంలో వ్యాపార అవకాశాలను గుర్తించిన టాటా, హెచ్‌ఎల్‌ఎల్‌ వంటి కంపెనీలు ఇందులోకి ప్రవేశించాయి. ఈ రంగంలో నైపుణ్యం ఉన్న వ్యక్తుల డిమాండ్‌కు తగ్గట్టుగా కాలేజీలు లేవు.


ఏకైక కాలేజీ

తెలంగాణ-హైదరాబాద్‌లో మాత్రమే గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లెదర్‌ టెక్నాలజీ ఉంది. దీన్ని 1980లో ఏర్పాటు చేశారు. ఎఐసీటీఈ ఆమోదంతో స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌కు అనుబంధంగా ఆరంభమైంది. ప్రస్తుతం ఈ కాలేజీ రెండు డిప్లొమా కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.

సీట్లు : ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉన్నాయి. పదో తరగతి పాసైనవారు ఇందులో చేరేందుకు అర్హులు. కోర్సులో చేరేందుకు గరిష్ఠ వయోపరిమితి లేదు. ‘టీఎస్‌ పాలిసెట్‌’లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా సీటు లభిస్తుంది.

కోర్సు కాలవ్యవధి: ఆరు సెమిస్టర్లు/మూడేళ్ళు. మొదటి అయిదు సెమిస్టర్లూ కాలేజీలోనే థియరీ, ప్రాక్టికల్స్‌ ఉంటాయి. ఆరో సెమిస్టర్‌ అంటే చివరి ఆరునెలలూ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. పూర్తిగా ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ కోసం ఈ ఆరు నెలలు కేటాయించారు. ఈ సమయంలో విద్యార్థులు ఇండస్ట్రీ రెడీ విద్యార్థుల తయారవుతారు. ఇంటర్న్‌షిప్‌ సమయంలో ఉచిత వసతికి తోడు విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలనుబట్టి నెలకు రూ.7,000 స్టయిపెండ్‌గా లభిస్తుంది.

ఉద్యోగ అవకాశాలు: దేశీయంగా బాటా వంటి కంపెనీలకు తోడు టాటా ఇంటర్నేషనల్‌ ఎక్స్‌పోర్ట్‌ డివిజన్‌, ఆడిడాస్‌, రీబాక్‌, నైక్‌, హిందుస్థాన్‌ లీవర్‌ లిమిటెడ్‌(ఎక్స్‌పోర్ట్‌ డివిజన్‌), ఫరీదా ఎక్స్‌పోర్ట్స్‌, ఫ్లోరెన్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌లో ఈ డిప్లొమా హోల్డర్లకు జాబ్స్‌ లభిస్తున్నాయి. ఆంత్రప్రెన్యూర్లుగా మారి సొంతంగా యూనిట్‌ పెట్టుకోవచ్చు. ఈ డిప్లొమాతోనే కొందరు విద్యార్థులు బహుళ జాతి సంస్థల్లో చేరుతున్నారు. ముఖ్యంగా చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వంటి దేశాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.

ఉన్నత చదువులు

లెదర్‌ టెక్నాలజీలో డిప్లొమాతోనే చదువు ఆపేయనవసరం లేదు. ఈసెట్‌ రాసి లేటరల్‌ ఎంట్రీ కింద బీఈ/ బీటెక్‌ రెండో ఏడాది కోర్సులో చేరవచ్చు. లెదర్‌ టెక్నాలజీ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఐటీ, సీఎస్‌ఈ చేయవచ్చు.

బీటెక్‌ అందించే కాలేజీలు

  • హర్‌కోర్ట్‌ బట్లర్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, కాన్పూర్‌

  • దయాల్‌బాగ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆగ్రా

  • అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ, అలీగఢ్‌

  • ముజఫర్‌పూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ముజఫర్‌పూర్‌

  • అలగప్పా కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, చెన్నై

  • సీఎ్‌సఆర్‌ సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చెన్నై

  • గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ లెదర్‌ టెక్నాలజీ, కోల్‌కతా

ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 05:19 AM