Share News

Donald Trump: ఈ దేశాలతోనే అమెరికాకు భారీ నష్టం.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Apr 07 , 2025 | 07:21 AM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల గురించి మరోసారి ప్రస్తావించారు. ప్రధానంగా పలు దేశాల కారణంగా అమెరికా ఆర్థికంగా నష్టపోయిందని, దీంతో లోటు కూడా పెరిగిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలపై సుంకాలు తప్పవని స్పష్టం చేశారు.

Donald Trump: ఈ దేశాలతోనే అమెరికాకు భారీ నష్టం.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) యూఎస్ ఆర్థిక విధానంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు చెప్పకనే చెప్పారు. అనేక దేశాలు తమ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నాయని మరోసారి గుర్తు చేశారు. ఈ క్రమంలో అమెరికా వాణిజ్య లోటు భారీగా పడిపోయిందన్నారు. ఈ క్రమంలో పలు దేశాలతో వాణిజ్య సుంకాలు విధించడం తప్పనిసరి అన్నారు. అందుకోసం ప్రధానంగా చైనా, యూరోపియన్ యూనియన్ (EU) సహా ఇతర దేశాలపై సుంకాలు విధించడం తప్పదన్నారు. ఇలా చేయడం ద్వారా అమెరికా వాణిజ్య లోటును సమతుల్యం చేసుకోవచ్చని వెల్లడించారు.


ఆర్థిక వ్యూహం

ట్రంప్ తన వ్యాఖ్యలలో అమెరికా లోటు తగ్గాలంటే సుంకాలు తప్పదన్నారు. సుంకాలు ఒక ఆర్థిక వ్యూహంగా, జాతీయ ప్రయోజనాలు సాధించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు. ట్రంప్ ప్రకారం, సుంకాలు కేవలం ఆదాయ వనరుగా కాకుండా, అమెరికా ఆర్థిక స్వావలంబనను పెంచుతుందన్నారు. పలువురు దీనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ప్రజలు మాత్రం ఏదో ఒక రోజు ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు.


జో బైడెన్ విధానాలపై విమర్శలు

అంతేకాదు ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై మరోసారి విమర్శలు చేశారు. ఆయనను నిద్రపోతున్న అధ్యక్షుడని ఎద్దేవా చేశారు. బైడెన్ పాలనలో అమెరికా వాణిజ్య లోటు మరింత పెరిగిందని, ప్రత్యేకంగా, చైనా, యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సంబంధాలు మరింత దిగజారాయన్నారు. బైడెన్ విధానాలు విదేశీ పోటీదారులకు అనుకూలంగా మారాయని, అవి అమెరికన్ పరిశ్రమను బలహీనపరిచాయని ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో తాను చెప్పినట్లు తిరిగి అధికారంలోకి రాగానే ఈ లోటును తీరుస్తానని హామీ ఇచ్చింది అమలు చేస్తున్నట్లు చెప్పారు.


గణాంకాలు, వాణిజ్య లోటు

అమెరికా వాణిజ్య పరిస్థితి ప్రస్తుతం చాలా అండర్ స్ట్రెయిన్ ఉందని ట్రంప్ అన్నారు. 2024లో, అమెరికా, చైనా మధ్య వాణిజ్య లోటు $295.4 బిలియన్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం కంటే 5.8% ఎక్కువ. అలాగే, యూరోపియన్ యూనియన్ వాణిజ్య లోటు 2024లో $235.6 బిలియన్లుగా నమోదైంది. 2023తో పోలిస్తే, ఇది 12.9% పెరిగింది. ఈ గణాంకాలు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తున్నాయని చెప్పవచ్చు.

ఛార్జీలు కాదు..

అనేక దేశాలు అమెరికాతో తమ వాణిజ్యాన్ని సమతుల్యం చేసుకునే వరకు, అమెరికా ఈ విధానాలను పాటిస్తుందన్నారు ట్రంప్. వీటిని కేవలం ఛార్జీలుగా కాకుండా, ఒక వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో యూరప్, ఆసియా సహా 50కి పైగా దేశాల నేతలతో ట్రంప్ చర్చలు జరిగినప్పటికీ, అమెరికా వాణిజ్య నష్టాలను అంగీకరించబోదని ఆయన స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 07 , 2025 | 08:21 AM