-
-
Home » Andhra Pradesh » Andhra Pradesh Telangana national and international latest news MLC oath ceremony IPL Today Match andhra jyothy news on 07th April 2025 suri
-

Breaking News: అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీ: సీఎం చంద్రబాబు
ABN , First Publish Date - Apr 07 , 2025 | 07:49 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-04-07T15:00:06+05:30
అమరావతిలో మెగా హెల్త్ హబ్: సీఎం చంద్రబాబు
అమరావతిలో మెగా హెల్త్ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం: చంద్రబాబు
ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు: చంద్రబాబు
ఆరోగ్యంపై ఏటా 19 వేల 200 కోట్లు కేటాయిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం రావడంలేదు: చంద్రబాబు
ఆసుపత్రుల్లో వసతి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది: చంద్రబాబు
వైద్యారోగ్య శాఖలో పలు ప్రయోగాలు చేస్తున్నాం: చంద్రబాబు
19,264 కోట్లు వైద్యారోగ్యశాఖలో ఖర్చు చేస్తున్నాం: చంద్రబాబు
ఆసుపత్రుల్లో రూమ్ ఛార్జీలు ఎక్కువ అవుతున్నాయి: చంద్రబాబు
అందుకే ఓ వినూత్నమైన ప్రయోగం చేస్తున్నాం: చంద్రబాబు
అన్ని నియోజకవర్గాల్లో 100-300 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు నిర్ణయం
అమరావతిని గ్లోబల్ మెడికల్ కేంద్రంగా మార్చాలని నిర్ణయం
కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో గుండె సంబంధిత ఇబ్బందులు ఎక్కువ
గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో డయాబెటీస్ ఎక్కువగా ఉంది: చంద్రబాబు
ప్రకాశం, కర్నూలు అనంతపురంలో రెస్పిరేటరి సంబంధిత వ్యాధులు వ్యాప్తి
ఎస్సీడీ సర్వే 2.0 జరిగింది.. ఇప్పడు 3.0 జరుగుతోంది: చంద్రబాబు
ఐదేళ్లలో ఆసుపత్రులకు వచ్చిన డేటా ఆధారంగా జిల్లాల్లో ఏ వ్యాధి ఎక్కువ అనే లిస్ట్ సిద్ధం చేశాం: చంద్రబాబు
8 లక్షల మంది బీపీ, షుగర్ బాధితులు చికిత్స తీసుకోవడం లేదు
షుగర్ వ్యాధి స్త్రీలు, పురుషులకు సమానంగా వస్తుంది: చంద్రబాబు
ఆహారపు అలవాట్ల వల్లే షుగర్ ఎక్కువగా వస్తుంది: చంద్రబాబు
-
2025-04-07T14:28:17+05:30
అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీ: సీఎం చంద్రబాబు
ఏపీలో వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
ఏపీలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధుల వివరాలు వెల్లడించిన ముఖ్యమంత్రి
అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీ: సీఎం చంద్రబాబు
ప్రతి నియోజకవర్గంలో 100-300 పడకల ఆస్పత్రులు: చంద్రబాబు
కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వే సెంటర్ ఏర్పాటు: చంద్రబాబు
గుండెజబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు..
కొన్నిచోట్ల విస్తృతంగా వ్యాపిస్తున్నాయి: చంద్రబాబు
పురుషుల కంటే మహిళల్లో హెపర్‌టెన్షన్ అధికంగా ఉంది: చంద్రబాబు
ఆహారపు అలవాట్ల వల్ల కొన్ని జిల్లాల్లో డయాబెటిస్ అధికం: చంద్రబాబు
ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం తగ్గిస్తే ఆరోగ్యం: చంద్రబాబు
వ్యాధుల నియంత్రణకు మంచి ఆహారపు అలవాట్లు పాటించాలి: చంద్రబాబు
నలుగురు సభ్యుల కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున 600 గ్రాములే తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
రోజుకు 15 గ్రాముల చొప్పున నెలకు 2 లీటర్ల నూనె వినియోగించాలి: చంద్రబాబు
రోజుకు 25 గ్రాముల చొప్పున నెలకు 3 కిలోల చక్కెర వినియోగించాలి: చంద్రబాబు
రోజుకు అరగంట వ్యాయామం.. ప్రాణయామం చేస్తే మంచిది: చంద్రబాబు
ఇటీవలే AIతో కూడిన న్యూట్రిషనల్ యాప్ తయారు చేశాం: చంద్రబాబు
యాప్‌కు స్కోచ్ అవార్డు కూడా వచ్చింది: చంద్రబాబు
ఇప్పటివరకు 4 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు: చంద్రబాబు
-
2025-04-07T14:26:05+05:30
ఘనంగా పట్టాభిషేకం..
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి తుమ్మల
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్
-
2025-04-07T14:25:23+05:30
మన్యం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం..
అల్లూరి: డుంబ్రిగూడ మండలంలో పవన్ కల్యాణ్ పర్యటన
పెదపాడులో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
గర్భిణీలకు కిట్లు పంపిణీ చేసిన పవన్ కల్యాణ్
గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్
గత ప్రభుత్వం నిధులు అడ్డగోలుగా వాడి రోడ్లు వేయలేదు: పవన్‌కల్యాణ్
మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక డోలీలతో ఇబ్బందులు: పవన్
మన్యం ప్రాంతాల్లో రోడ్లు వేయాలని సీఎం ఇంటికి వెళ్లి కోరా: పవన్‌కల్యాణ్
నేను కోరిన 24 గంటల్లో రూ.49 కోట్లు మంజూరు చేశారు: పవన్‌కల్యాణ్
అడవితల్లి కార్యక్రమం ప్రారంభించడానికి బలం వచ్చింది: పవన్‌కల్యాణ్
-
2025-04-07T13:01:18+05:30
మరో లిఫ్ట్ ప్రమాదం
హైదరాబాద్: ఆసిఫ్‌నగర్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం
అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందపడిన లిఫ్ట్
ముగ్గురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు
ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో ఆరుగురు
-
2025-04-07T13:00:44+05:30
బీఆర్ఎస్ నేతకు షాకిచ్చిన పోలీసులు..
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు పోలీసుల నోటీసులు
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో నోటీసులు ఇచ్చిన గచ్చిబౌలి పోలీసులు
ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారంటూ నోటీసులు
ఈనెల 9, 10, 11న గచ్చిబౌలి పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని తెలిపిన పోలీసులు
-
2025-04-07T12:57:39+05:30
సమావేేశమైన గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు..
హైదరాబాద్: గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కీలక సమావేశం
హాజరైన తెలంగాణ ఈఎన్సీ అనిల్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు
బనకచర్ల, గోదావరి అనుసంధాన ప్రాజెక్ట్, తెలంగాణ అభ్యంతరాలపై చర్చ
గోదావరిపై నిర్మించిన 16 ప్రాజెక్టులను GRMBకి అప్పగించడంపై చర్చ
-
2025-04-07T12:51:04+05:30
గుడ్ న్యూస్.. రాజధానికి నిధులు విడుదల చేసిన కేంద్రం..
రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు విడుదల
రూ.4,285 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
అమరావతి నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నిధుల నుంచి 25శాతం విడుదల
కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4,285 కోట్లు విడుదల
పనులు ప్రారంభం అవుతున్నందున 25 శాతం నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని కోరిన CRDA
CRDA వినతితో నిధులు విడుదల చేసిన మోదీ సర్కార్
-
2025-04-07T12:33:52+05:30
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
అన్నమయ్య జిల్లా రోడ్డుప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి పట్ల సంతాపం
-
2025-04-07T12:24:25+05:30
ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట..
ఢిల్లీ: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
మద్యం కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేయెద్దంటూ సుప్రీం ఆదేశం
తనపై కేసు నమోదు చేయకపోయినా అరెస్టు చేస్తారనే భయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎంపీ
అరెస్టు నుంచి కాపాడాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మిథున్ రెడ్డి
నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశం
ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
-
2025-04-07T12:14:01+05:30
ఘోర రోడ్డుప్రమాదం.. డిప్యూటీ కలెక్టర్ మృతి..
అన్నమయ్య జిల్లా: రాయచోటి- చిత్తూరు రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం
రోడ్డుప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి,
సంబేపల్లె దగ్గర ప్రమాదవశాత్తూ ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు
కారులో ఇరుక్కుపోయిన డిప్యూటీ కలెక్టర్, బయటకు తీసిన స్థానికులు
రాయచోటి ప్రభుత్వ తరలిస్తుండగా డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి
ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
2025-04-07T11:42:43+05:30
కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు
ఢిల్లీ: కొత్త వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు
ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట మెన్షనింగ్
మెన్షన్ చేసిన ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్
త్వరితగతిన విచారణ చేపట్టాలని వినతి
పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ముస్లిం పర్సనల్ లా బోర్డుతోపాటు పలు రాజకీయ పార్టీలు
ఇవాళ మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసిన సీజేఐ సంజీవ్ ఖన్నా
-
2025-04-07T11:14:02+05:30
కంచ గచ్చిబౌలి భూములు.. నేడే విచారణ..
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూ వివాదంపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ
కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశం
మరోవైపు చెట్ల నరికివేతపై కౌంటర్ దాఖలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నేడు కంచ గచ్చిబౌలి భూములపై కౌంటర్ దాఖలు చేయనున్న తెలంగాణ సర్కార్
నేడు పిటిషన్‌ను విచారించనున్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం
-
2025-04-07T10:44:38+05:30
ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం.. షురూ..
హైదరాబాద్: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
ఎమ్మెల్సీలుగా ప్రమాణం స్వీకారం చేసిన మల్కా కొమురయ్య, అంజి రెడ్డి
శ్రీపాల్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించిన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డా.లక్ష్మణ్, రఘునందన్ రావు
-
2025-04-07T09:27:13+05:30
దేశీయ మార్కెట్లు.. భారీ నష్టాలు..
భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు
3900 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్
-
2025-04-07T09:19:37+05:30
బెట్టింగ్ వివాదం - యువకుడిపై దాడి
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు-మునుకుళ్ల రోడ్డులో ఐపీఎల్ బెట్టింగ్ వివాదం
బెట్టింగ్ విషయంలో వివాదం చెలరేగి ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ
మ్యాచ్ విషయమై ఇరువురు మధ్య క్వార్టర్ బాటిల్ పందెం ఒప్పందం
కర్రి నవీన్ కుమార్, కొయ్యల గంగా మహేశ్ మధ్య మద్యం బాటిల్ కొనివ్వలేదని ఘర్షణ
మద్యం మత్తులో ఉన్న మహేశ్ ఖాళీ సీసాతో నవీన్‌పై దాడి
నవీన్ కుమార్‌ను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలింపు
-
2025-04-07T09:10:58+05:30
మాజీ మంత్రి కాకాణి కేసులో మరో ముగ్గురికి నోటీసులు..
నెల్లూరు: అక్రమ క్వాడ్జి కేసులో బయటకు వస్తున్న సంచలన విషయాలు
మాజీ మంత్రి కాకాణి కేసులో తాజాగా మరో ముగ్గురికి నోటీసులిచ్చిన పోలీసులు
ఉరిబండి ప్రభాకర్ రెడ్ది, ఉరిబండి చైతన్య, కాకాణి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డికి నోటీసులు
సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు
ఇప్పటికే మాజీ మంత్రి సహా 10 మందికి నోటీసులు ఇచ్చిన నెల్లూరు పోలీసులు
-
2025-04-07T08:49:41+05:30
యాక్సిడెంట్ ముసుగులో హత్య..
హైదరాబాద్: మహేశ్వరం పరిధిలో యాక్సిడెంట్ ముసుగులో హత్య
భూతగాదాల వివాదంలో శంకరయ్య అనే వ్యక్తిని హత్య చేసిన నిందితులు
పథకం ప్రకారం శంకరయ్యను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ
బైక్‌పై వెళ్తున్న శంకరయ్యను కారుతో ఢీకొట్టిన హత్య
సీసీ కెమెరా దృశ్యాలను గమనించి శంకరయ్యది హత్యగా తేల్చిన పోలీసులు
హత్య చేసేందుకు ఉపయోగించిన రెండు కార్లు స్వాధీనం
ఏప్రిల్ రెండో తేదీన కల్వకోల్ గేటు సమీపంలో హత్య
ప్రధాన నిందితుడు నర్సింగరావుతోపాటు మరో నలుగురు అరెస్టు, రిమాండ్
-
2025-04-07T08:38:52+05:30
పాస్టర్ అజయ్ బాబు అరెస్టు..
సికింద్రాబాద్: తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాస్టర్ అజయ్ బాబు అరెస్టు
హిందూ దేవుళ్లను విమర్శిస్తూ మత కల్లోలాలకు తెర లేపుతున్నారంటూ రోమన్ క్యాథలిక్ జోసఫ్ ఫిర్యాదు
పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపైనా అర్ధరహిత ప్రచారం చేశారంటూ ఫిర్యాదు
జోసఫ్ ఫిర్యాదుతో అజయ్ బాబును అరెస్టు చేసిన పోలీసులు
అయితే అరెస్టు విషయం బయటకు రాకుండానే రిమాండ్ చేసినట్లు సమాచారం
-
2025-04-07T07:58:02+05:30
ఆటో బోల్తా.. ఒకరి మృతి, పది మందికి గాయాలు..
కృష్ణాజిల్లా: నందివాడ మండలం పుట్టగుంట వద్ద ఆటో బోల్తా
ప్రమాదంలో ఒకరి వ్యక్తి మృతి, 10మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
పుట్టగుంట వద్ద రోడ్డుపై వెళ్తున్న గేదెను తప్పించబోయి అదుపుతప్పిన ఆటో
కోసం వెంకటేశ్వరరావు (35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి
క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు
మెరుగైన చికిత్సల నిమిత్తం ఇద్దరిని విజయవాడ తరలించిన వైద్యులు
గుడివాడలోని ఓ కార్పొరేట్ పాఠశాల హాస్టల్లో వంట పని ముగించుకుని అరిపిరాల గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నందివాడ పోలీసులు
-
2025-04-07T07:49:52+05:30
ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు
హైదరాబాద్: నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు
ఉదయం 9:15 నుంచి 11:30 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేయనున్న నలుగురు ఎమ్మెల్సీలు
శాసన మండలిలో ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్న ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ప్రమాణం చేయనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్
అలాగే నేడు ప్రమాణం స్వీకారం చేయనున్న సీపీఐ నుంచి ఎన్నికైన నెల్లికంటి సత్యం