-
-
Home » Andhra Pradesh » Today Breaking News Holi Celebratons and Janasena Foudation Day Live Updates in Telugu News Fiday 14th March 2025 Amar
-

Breaking News: జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడింది: నాదెండ్ల
ABN , First Publish Date - Mar 14 , 2025 | 10:51 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-03-14T20:37:37+05:30
జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడింది: నాదెండ్ల
కష్టపడి యువతరాన్ని నాయకత్వంగా మార్చాలని చెప్పారు.
జనసేనలో 12.32 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారు.
కష్టమైన ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాం.
ప్రతిపక్షంలోనైనా.. అధికారంలోనైనా.. ఒకేలా ఉన్నాం.
-
2025-03-14T19:33:36+05:30
వైఎస్‌ని అడ్డుపెట్టుకుని నువ్వు సీఎం అయ్యావు: బాలినేని
మా నాయకుడు స్వశక్తితో ఎదిగారు.
నన్ను జనసేనలోకి తీసుకువచ్చింది నాగబాబు.
పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా.
నా మంత్రి పదవిని జగన్ తీసేశారు.. నేనేమీ బాధపడలేదు.
RRR ఏదో అన్నారని లోపలపెట్టి ఆయన్ను కొట్టించావు.
చేసిన పాపాలు ఎక్కడికీ పోవు అని జగన్ తెలుసుకోవాలి.
-
2025-03-14T19:30:58+05:30
జగన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలినేని..
కాకినాడ: జనసేన ఆవిర్భావ సభలో బాలినేని శ్రీనివాస రెడ్డి.
పోసాని కృష్ణ మురళి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్లను దూషించాడు.
అటువంటివారిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించాడు.
జగన్ కు ఆ తిట్లు, నీతిమాలిన మాటలు కనిపించలేదా.
17యేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మరి బాధ కలగదా.
గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీలో చాలామంది వెధవలు ఉన్నప్పటికీ.
బాలినేని వంటి వారు మంచివారు కూడా ఉన్నారని నా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అప్పుడే జనసేనలోకి రావాల్సింది. ఆలస్యమైంది.
నాది ఒకటే విజ్ఞప్తి తప్పు చేసిన చిన్న కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నారు.
కానీ స్కీములు పేరుతో స్కాములు చేసి కోట్లు దోచుకున్న వారి దర్జాగా తిరుగుతున్నారు.
అటువంటి అవినీతిపరులు గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలి.
-
2025-03-14T19:15:44+05:30
లలిత జ్యువెలరీలో బంగారం మాయం.
బంగారు కాయిన్ స్థానంలో వెండి బిళ్ళకు బంగారు పూత పూసి మోసం చేసిన అగంతకుడు.
సీసీ ఫుటేజ్‌లో బయటపడిన బండారం.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.
-
2025-03-14T19:11:45+05:30
చిత్రాడలో జనసేన భారీ బహిరంగసభ.. లైవ్ వీడియో ఇక్కడ చూడండి..
-
2025-03-14T19:09:53+05:30
జనసేన సభలో నాగబాబు హాట్ కామెంట్స్..
కాకినాడ: జనసేన సభలో నాగబాబు
పుష్కరాలు ఎంత పవిత్రమైనవో.. సభ కూడా అంతే.
నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశాం.
నోటి దురుసుఉన్న నేతకు ప్రతిపక్ష హోదా దక్కలేదు.
రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ చెప్పారు.
పవన్‌కల్యాణ్ క్రమశిక్షణ కలిగిన నేత.
12ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
ఇది జనసేన పుష్కర మహోత్సవం.
జగన్ లాంటి హాస్యనటుడు కలలు కంటూనే ఉంటారు.
మరో 20ఏళ్ల వరకు కలలు కంటూనే ఉండాలని సలహా.
పిఠాపురంలో ఘన విజయం సాధిస్తానని పవన్‌కు ముందే తెలుసు.
రాబోయే 20 ఏళ్లలో ఏపీ స్వర్ణయుగం చూడబోతోంది.
పదవులు వచ్చినా రాకపోయినా ఆయనకు సేవలు చేస్తాం.
ప్రజలు బాగోగులు చూసే వ్యక్తి పవన్‌కల్యాణ్.
అడగకుండానే వరాలు ఇచ్చేది పవన్‌కల్యాణ్.
జనసేనకు ప్రాణవాయువు కార్యకర్తలు, వీర మహిళలు.
పవన్‌లా గొప్ప వ్యక్తి కావాలి..లేకుంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలి.
-
2025-03-14T19:01:29+05:30
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం
నదియా జిల్లాలో ప్రమాదం, ఏడుగురు మృతి
మూడు ఆటోలను ఢీకొన్న కారు
ముగ్గురు మహిళలు, చిన్నారి సహా ఏడుగురు మృతి
-
2025-03-14T17:55:59+05:30
మాజీ సీఎంకు స్వల్ప ఊరట..
పోక్సో కేసులో యడియూరప్పకు స్వల్ప ఊరట
మార్చి 15న పోక్సో కేసు విచారణకు హాజరుకావాలని..
ఇటీవల ఆదేశించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు
ఆ పోక్సో కేసు సమన్లను నిలిపివేసిన కర్ణాటక హైకోర్టు
-
2025-03-14T17:37:17+05:30
ఐస్ క్రీమ్ అని తిన్నారో అంతేసంగతులు.. పెద్ద స్కామే చేస్తున్నారుగా..
హైదరాబాద్: హోలీ ముసుగులో గంజాయి వినియోగం
ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారుల దాడులతో వెలుగులోకి వాస్తవాలు
దూల్‌పేటలో గంజాయితో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌తో పాటు..
గంజాయి బాల్స్‌ను స్వాధీనం చేసుకున్న ఎస్టీఎఫ్ పోలీసులు
దూల్‌పేట్‌లో మల్చీపురాలో కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లో గంజాయి
బర్ఫీ స్వీట్స్, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయి వినియోగం
100 కుల్ఫీ గంజాయి చాక్లెట్లు, 72 గాంజా బర్ఫీ స్వీట్స్ స్వాధీనం
-
2025-03-14T17:34:28+05:30
మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు..
హిమాచల్‌ప్రదేశ్: బిలాస్‌పూర్‌లో కాల్పుల కలకలం
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బంబర్ ఠాకూర్‌పై కాల్పులు
12 రౌండ్లు కాల్పులు జరిపి పరారైన దుండగులు
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బంబర్ ఠాకూర్
-
2025-03-14T15:49:57+05:30
తూర్పుగోదావరి: జనసేన ఆవిర్భావ సభకు తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు.
ఒక్కో గ్యాలరీలో 2500 మంది కూర్చునేలా ఏర్పాట్లు.
ఎండ వేడిమితో గ్యాలరీలను వీడి నీడ ఉన్న ప్రాంతాలకు పరుగులు.
ఎండ తగ్గిన తర్వాత గ్యాలరీల్లోకి వస్తామంటున్న మహిళలు.
వచ్చిన వారికి పిఠాపురం పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా అన్నదాన కేంద్రాలు ఏర్పాటు.
రాత్రి సభ అనంతరం కూడా భోజనాలు అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు.
సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది మధ్యలో సభా వేదికపై పవన్ కళ్యాణ్.
-
2025-03-14T15:47:01+05:30
కాకినాడ: కిక్కిరిస్తున్న చిత్రాడ సభ ప్రాంగణం.
వీఐపీ పాసులు ఉన్నా సరే లోపలికి నేతలను అనుమతించని పోలీసులు.
ఇప్పటికే లోపల గ్యాలరీలు అన్ని ఫుల్.
అటు కార్యకర్తల గ్యాలరీలు కూడా నిండిపోవడంతో వచ్చిన వారిని లోపలికి అనుమతించని పోలీసులు.
ఈసురోమని వెనుదిరుగుతున్న జనసేన నాయకులు కార్యకర్తలు.
-
2025-03-14T15:40:58+05:30
సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు.. మ్యాటర్ ఏంటంటే..
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
కేసీఆర్‌పై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటోన్న బీఆర్ఎస్ నేతలు.
రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటోన్న బీఆర్ఎస్.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన శంబీపూర్ రాజు, వివేకానంద, మర్రి రాజశేఖరరెడ్డి.
-
2025-03-14T15:24:45+05:30
శంషాబాద్ అర్జీఐఏ పీఎస్ పరిధిలో డ్రగ్స్ గుర్తింపు
అభిషేక్ సంజయ్ నుంచి 17గ్రాముల MDMA స్వాధీనం
డ్రగ్ లవర్స్ వెబ్ పేజీ నుంచి డ్రగ్స్ విక్రయాలు
డ్రగ్స్ డెలివరీ తర్వాత ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లింపు
పరారీలో ఉన్న నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ కోసం గాలింపు
-
2025-03-14T15:15:30+05:30
వరంగల్‌లో కిలాడీ లేడీ అరాచకాలు
విద్యార్థినులను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి..
వారిపై తన ముఠా సభ్యులతో అత్యాచారాలు
ఓ బాలిక మిస్సింగ్ కేసుతో బయటపడ్డ ఘోరాలు
కిలాడీ లేడీ స్వస్థలం హనుమకొండ జిల్లా దామెర
ముఠాలో కిలాడీ లేడీ, మరో లేడీ సహా నలుగురు యువకులు
ఏడాదిన్నరగా బాలికలపై అత్యాచారాలు
-
2025-03-14T14:47:26+05:30
మరికాసేపట్లో జనసేన ఆవిర్భావ సభ.. భారీగా తరలివస్తున్న జనసైనికులు..
కాకినాడ: మరి కాసేపట్లో చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ.
భారీగా తరలివస్తున్న జన సైనికులు.
రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు.. కార్లల్లో తరలి వస్తున్న జనం.
సభా ప్రాంగణంలో పని చేయని సిగ్నల్స్.
-
2025-03-14T13:10:56+05:30
రేవంత్‌పై కేటీఆర్ సెటైర్లు
రేవంత్ ఢిల్లీ వ్యాఖ్యలపై ఎక్స్‌లో కేటీఆర్ ట్వీట్
గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో చిట్ చాట్లు
కాలు గడప దాటదు కానీ .. ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయి
నీళ్లు లేక పంటలు ఎండి.. పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే .. కనీసం సాగునీళ్లపై సమీక్ష లేకుండా సీఎం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు
39 సార్లు ఢిల్లీ పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప .. ఢిల్లీ నుండి సాధించిన పని .. తెచ్చిన రూపాయి లేదు
రాహుల్ గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం .. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి.. ఊడితే మాకేంటి .. తెలంగాణకు ఒరిగేది ఏంటి
గ్రామ గ్రామాన, గల్లీ గల్లీల్లో మీకు ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే, చీమకుట్టినట్టు కూడా లేని ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు
-
2025-03-14T12:37:22+05:30
మంత్రి సీతక్క నివాసంలో హోలీ సంబరాలు
తన భద్రత సిబ్బంది, కార్యాలయ, నివాస సిబ్బందితో కలిసి రంగుల పండుగలో పాల్గొన్న మంత్రి సీతక్క
రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
-
2025-03-14T11:06:04+05:30
హోలీ వేడుకల్లో బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి
దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాకంక్షలు
ఉత్తరాది లో పండుగగా హోలీ ని జరుపుకుంటారు
హోలీని వసంతోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటాం
ప్రాంతాలకు అతీతంగా జరుపుకునే పండుగ హోలీ
సబ్ కా సాత్-సబ్ కా వికాస్ అంటూ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెెళ్లాలనేది ప్రధాని మోదీ సందేశం
బీజేపీ భావన కూడా ఇదే.. పార్టీ నాయకులంతా ఈమార్గంలో వెళ్లాలి
అంతా కలసి ఉండాలనే సందేశంతో ప్రజలంతా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా
-
2025-03-14T10:51:19+05:30
ఘనంగా హోలీ సంబరాలు
హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు
వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న యువత
సిటీలో పలు ప్రాంతాల్లో హోలీ ఈవెంట్స్
డీజేల హోరు, బ్యాండ్ బాజాతో యువత సందడి
హోటల్స్, కన్వెన్షన్ సెంటర్స్, రిసార్ట్స్, గ్రౌండ్స్ లో హోలీ వేడుకలు
డిఫరెంట్ థీమ్స్‌తో ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్లాన్