అసెంబ్లీకి వేళాయే..కేసీఆర్ హాజరు..
ABN, Publish Date - Mar 12 , 2025 | 12:02 PM
2025 - 2026 బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ, మండలిలో చర్చించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్రెడ్డి సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఈసారి అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అసెంబ్లీకి చేరుకున్నరు.

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ వన్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

2025 - 2026 బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో శాసనసభ, మండలిలో చర్చించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్రెడ్డి సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Updated at - Mar 12 , 2025 | 12:02 PM