Minister Manohar: పిఠాపురం నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన
ABN, Publish Date - Mar 12 , 2025 | 08:39 AM
పిఠాపురం నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద మార్చి 14వ తేదీన నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ , మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు.

ప్రాంగణంలో ఉండే అతిథులతో పాటు, సాంకేతిక, మెడికల్ బృందాలను, అధికారులు, కళాకారులు, సమన్వయం చేసుకొంటూ వారికి అవసరమైన ఏర్పాట్లను చూసే బాధ్యతను పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంగిశెట్టి అశోక్‌కు మంత్రి నాదెండ్ల మనోహర్ అప్పగించారు.

సభా స్థలిలో ఏర్పాటు చేస్తున్న లైటింగ్, సౌండ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చించారు.

సంబంధిత బాధ్యతలు చూస్తున్న వారితో చర్చించారు. అదే విధంగా వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు.

పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కల్యాణం శివ శ్రీనివాస్‌కి సూచనలు చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, శాసన సభలో ప్రభుత్వ విప్‌లు బొలిశెట్టి శ్రీనివాస్,అరవ శ్రీధర్ ఏర్పాట్లను పరిశీలించారు.

సభా ప్రాంగణంలో ఆతిథ్య సమన్వయంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఆవిర్భావ సభకు హాజరయ్యే అతిథులను సమన్వయపరచడంపై చర్చించారు.
Updated at - Mar 12 , 2025 | 08:42 AM