Social Media : సోషల్ మీడియా యూజర్లు ఈ మిస్టేక్స్ చేస్తే జరిగేదిదే..
ABN, Publish Date - Mar 12 , 2025 | 04:50 PM
Social Media Users : భారతదేశంలో కోట్ల మంది ప్రజలు వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్‌బుక్, ఎక్స్ ఇలా ఏదొక సోషల్ మీడియా ఖాతా తప్పక ఉపయోగిస్తున్నారు. కచ్చితంగా ఏదొక ప్లాట్‌ఫాంలో పోస్టులు పెట్టే అలవాటు చాలామందికి ఉంటుంది. కాబట్టి తెలిసీ తెలియక మనం చేసే తప్పులు ఎలాంటి సమస్యలకు దారి తీస్తాయో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం..

ఈ టెక్ యుగంలో సోషల్ మీడియా అకౌంట్లు లేనివారు అరుదు. ఇండియాలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదొక సోషల్ మీడియా అకౌంట్లు యూజ్ చేస్తున్నారు.

సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ఎవరైనా పోస్టులు పెట్టడం, ఇతరులు పోస్ట్ చేస్తే కామెంట్ చేయడం సర్వసాధారణం. ఈ విషయంలోనే యూజర్లు అప్రమత్తంగా ఉండాలి. తెలియకుండా మీరు చేసే పోస్టులు, కామెంట్ల వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది.

భారతదేశంలో సోషల్ మీడియాలో యూజర్లు చేసే పోస్టుల విషయమై కొన్ని కఠిన నిబంధనలు ఉన్నాయి. మీరు వీటిని ఉల్లంఘిస్తే జైలు శిక్ష పడే అవకాశాలు లేకపోలేదు. అందుకు ఈ నియమ నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.

కనిపించిన ప్రతి వీడియో లేదా పోస్ట్ చూసి కామెంట్లు పెట్టే వారిలో మీరూ ఉన్నట్లయితే ఇకపై తప్పక జాగ్రత్త వహించండి. అవతలి వ్యక్తిని రెచ్చగొట్టేలా, కించపరిచేలా పొరపాటున కూడా కామెంట్ పెట్టకండి. ఇలా చేస్తే భారీ జరిమానా లేదా జైలు శిక్ష పడవచ్చు.

ముఖ్యం వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్ నిర్వహించేవారు తాము షేర్ చేసే కంటెంట్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పుకార్లను వ్యాప్తి చేసినందుకు చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అభ్యంతరకరమైన వీడియోలు, ఫొటోలు వ్యాప్తి చేసినా శిక్ష తప్పదు.

ఐటీ సెక్షన్ 67 ప్రకారం రెచ్చగొట్టే వీడియోలు, కంటెంట్ పోస్ట్ చేస్తే 3 ఏళ్లు జైలుశిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధించవచ్చు. పదే పదే ఇదే తప్పు ఐటీ సెక్షన్ 67A కింద 5 ఏళ్లు జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తారు.
Updated at - Mar 12 , 2025 | 05:01 PM