Viral News: 2 మసాలా దోశ.. 2 కప్పుల కాఫీ ఒకే రేటా.. మరీ ఇంత దారుణమా..
ABN , Publish Date - Apr 03 , 2025 | 07:15 PM
1971 Tiffins And Coffee Rates: ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్‌కు సంబంధించిన పాత బిల్లు ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బిల్లులో రెండు మసాల దోశలు, రెండు కప్పుల కాఫీ ధరలు ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రెండిటి ధర ఒకటే కావటం. నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

రోజు రోజుకు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోతే ఆటోమేటిక్‌గా హోటల్‌లో అమ్మే పదార్థాల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు కప్పు టీ .. ఓ మీడియం సైజు రెస్టారెంట్‌లో 20 రూపాయలకు అమ్ముడవుతోంది. కాఫీ ధర కూడా ఇంచుమించు అంతే ఉంది. అయితే.. 40 ఏళ్ల క్రితం కాఫీ ధర చాలా తక్కువగా ఉండేది. ఆ సమయానికి అదే ఎక్కువ రేటు అనుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. కాఫీ రేటు.. మసాలా దోశలతో సమానంగా ఉండటం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రెస్టారెంట్ బిల్లు వైరల్‌గా మారింది. ఆ బిల్లులో రెండు మసాలా దోశలు.. 2 కప్పుల కాఫీ ధర సమానంగా ఉంది. ఒక్కో మసాల దోశ 50 పైసల చొప్పున రెండిటికి 1 రూపాయి బిల్లు అయింది. అదే విధంగా ఒక కప్పు కాఫీకి 50 పైసల చొప్పున.. రెండు కప్పుల కాఫీ కూడా అంతే ధర పలికింది.
1971 సంవత్సరంలో ఢిల్లీలోని మోతీ మహాల్ హోటల్‌లో దోశలతో సమానంగా కాఫీ రేటు ఉండేదని ఆ బిల్లును బట్టి అర్థం అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ బిల్లుపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ ఇది మరీ దారుణం.. మసాల దోశ, కాఫీ ఒకే రేటా?’.. ‘ 1971లో ఇదే పరిస్థితి.. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి.. మన వ్యసనాలతో బిజినెస్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏదైనా తిన్నతర్వాత టీ, కాఫీలు తాగకుండా ఉండలేరు. అదీ విషయం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఒక దోశ ధర 30 రూపాయలు పైనే ఉంటోంది. మనం ఖరీదైన రెస్టారెంట్‌కు వెళితే.. ఈజీగా పాకెట్ ఖాళీ అవుతుంది. బిల్లు 2,3 వందలు అయిపోతుంది. ఒకప్పుడు ఫుల్ మీల్స్ ధర రెండు నుంచి నాలుగు రూపాయలు ఉండేది. ఇప్పుడు మినిమం 100 రూపాయలు పెట్టాల్సిందే.
1985-1993 ధరలు ఇలా..
1971 నుంచి ఓ 14 ఏళ్లు ముందుకు వెళితే.. 1985లో ముంబైలోని మైసూర్ కేప్‌లో ఒక మసాల దోశ ధర 8 రూపాయలు ఉండేది. రెండు ఇడ్లీలు, ఓ వడ కలిపి 6 రూపాయలు ఉండేది. ఒక కప్పు కాఫీ ధర 3 రూపాయలు ఉండేది. ఫుల్ మీల్స్ 2 రూపాయలు ఉండేది. 1993 నాటికి ధరలు బాగా పెరిగాయి. శరవణ భవన్‌లో ఓ మంచి మసాల దోశ 24 రూపాయలు ఉండేది. అదే ప్రదేశంలో ఇప్పుడు ఒక మసాల దోశ ధర 110 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్లలో టిఫిన్ల ధర 100 రూపాయలు ఉంది.
ఇవి కూడా చదవండి:
MP Raghunandan Rao: సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ రఘునందన్ రావు..
Gachibowli Land Dispute: ఫేక్ వీడియోలు ప్రచారం.. ఆ పార్టీ నేతలపై కేసు నమోదు..