Jugad Viral Video: సీలింగ్ ఫ్యాన్‌తో ఏసీ ఎఫెక్ట్.. ప్రయోగం చూశారంటే నోరెళ్లబెట్టాల్సిందే..
ABN , Publish Date - Apr 15 , 2025 | 07:36 PM
ఓ వ్యక్తి తన ఇంట్లో ఏసీ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే అంత ఖర్చు చేసే స్థోమత లేకున్నా కూడా ఎలాగోలా కనీసం ఏసీ ఎఫెక్ట్ అయినా తేవాలని చూశాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ విచిత్ర ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు..

ఇళ్లల్లోని వస్తువులతో కొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. మరికొందరు అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుత ప్రయోగాలు చేస్తుంటారు. ఇకొందరు చేసే ప్రయోగాలు చూసినప్పుడు.. ‘‘అరే ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌తో విచిత్ర ప్రయోగం చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో ఏసీ ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. అయితే అంత ఖర్చు చేసే స్థోమత లేకున్నా కూడా ఎలాగోలా కనీసం ఏసీ ఎఫెక్ట్ అయినా తేవాలని చూశాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి, చివరకు ఓ విచిత్ర ప్రయోగం చేశాడు.
సీలింగ్ ఫ్యాన్ పైన (Water bottle on ceiling fan) వాటర్ బాటిల్‌ను కట్టేశాడు. దాన్నుంచి సన్నని ధారలా వస్తున్న నీరు ఫ్యాన్‌పై పడేలా ఏర్పాట్లు చేశాడు. ఫైనల్‌గా ఫ్యాన్ గిరగిరా తిరుగుతుండగా.. దానిపై పడిన నీరు ఇంటి ఇంట్లో స్ప్రే కొడుతూ కూల్‌గా మార్చేస్తున్నాయి. ఇలా వాటర్ బాటిల్, సీలింగ్ ఫ్యాన్‌తో ఇంట్లో ఏసీ ఎఫెక్ట్ తెచ్చిన ఈ వ్యక్తి ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సీలింగ్ ఫ్యాన్, వాటర్ బాటిల్‌తో ఇలాక్కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 35 వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Elephant VS Lions: సింహాలు గుంపులుగా ఉంటే.. సింగిల్‌గా వచ్చిన ఏనుగు.. చివరకు చూడగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..